స్కూల్లో విద్యార్థులు చేసిన పాడు పనేంటో చూడండి!

Header Banner

స్కూల్లో విద్యార్థులు చేసిన పాడు పనేంటో చూడండి!

  Mon Jan 15, 2018 21:29        India, Telugu

పాఠశాలకు వెళ్లి విద్యాబుద్దులు నేర్చుకుని ఉన్నతస్థాయికి వెళ్లాల్సిన విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. పెన్ను, పెన్సిల్‌ పట్టాల్సిన చేతులతో కత్తులు పట్టి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అంతేకాదు అడ్డొచ్చిన 14 మంది విద్యార్థులను, టీచర్‌‌ను కూడా గాయపరిచారు. ఈ దారుణ ఘటన రష్యాలోని పెర్మ్ సిటీ ఉరల్ పర్వతాల్లోని ఓ సెకండరీ స్కూల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 

      11 గ్రేడర్ విద్యార్థి, పూర్వ విద్యార్థి మధ్య వ్యక్తిగత గొడవలుండేవి. అయితే సోమవారం రోజు గోడదూకి స్కూల్లోకి ప్రవేశించిన పూర్వ విద్యార్థి.. అక్కడ చదువుతున్న 11 గ్రేడర్ విద్యార్థిపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఇరువురూ కత్తులతో గొడవకు దిగారు. అడ్డొచ్చిన విద్యార్థులను, టీచర్‌ను తీవ్రంగా గాయపరిచారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు, టీచర్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం గాయపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

          ఈ గొడవలో సుమారు 15మంది గాయపడ్డారని తెలుస్తోంది. స్కూల్లో ఈ గొడవ జరిగిన ప్రాంతం మొత్తం రక్తపు మరకలతో నిండి ఉంది. గొడవ పడ్డ విద్యార్థుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో విద్యార్థులను, టీచర్లను వెళ్లగొట్టి తరగతులను రద్దు చేశారు. అనుమానాస్పదులను పట్టుకుని విచారిస్తున్నారు. స్కూల్ వద్ద ప్రత్యేక బందోబస్తుతో పోలీసులు పహారా కాస్తున్నారు.

    స్కూల్లో విద్యార్థులు చేసిన పాడు పనేంటో చూడండి!