క్షమించరాని నేరం చేసిన పాండ్యా

Header Banner

క్షమించరాని నేరం చేసిన పాండ్యా

  Mon Jan 15, 2018 21:03        India, Sports, Telugu

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకున్న ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాపై విమర్శల జడివాన కురుస్తోంది. క్రీజులోకి చేరుకున్నప్పటికీ కాలు మోపకుండా అనవసరంగా వికెట్ పారేసుకున్న పాండ్యాపై అభిమానులే కాదు.. మాజీ క్రికెట్లరు, క్రీడా పండితులు కూడా విరుచుకుపడుతున్నారు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ పాండ్యా క్షమించరాని నేరం చేశాడని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. ఎంతో విలువైన సమయంలో వృథాగా వికెట్ పారేసుకోవడం ఎంతమాత్రమూ సహించరానిదన్నాడు. ఇక నెటిజన్లు అయితే పాండ్యాపై విరుచుకుపడుతున్నారు. ఇంత చెత్తగా కూడా అవుటవుతారా? అంటూ నిలదీస్తున్నారు.

 

తొలి ఇన్నింగ్స్ 68వ తొలి బంతికి సింగిల్ తీసే ప్రయత్నంలో పాండ్యా రనౌట్ అయ్యాడు. పరుగు కోసం ప్రయత్నించి విఫలమై వెనుదిరిగిన పాండ్యా క్రీజులోకి వచ్చినప్పటికీ బ్యాట్‌ను కానీ, పాదాన్ని కానీ మోపడంలో విఫలమయ్యాడు. ఈలోగా బంతి వికెట్లను గిరాటేసింది. పాండ్యా అవుటైనట్టు థర్డ్ అంపైర్ ప్రకటించాడు.

 


   క్షమించరాని నేరం చేసిన పాండ్యా