వేరు వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు..!

Header Banner

వేరు వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు..!

  Wed Jan 03, 2018 21:56        India, Telugu

కొన్ని కొన్ని ఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇదేకోవకు చెందిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. వేరు వేరు సంవత్సరాల్లో కవలలు జన్మించారు. వేరు వేరు సంవత్సరాల్లో కవలలు జన్మించడం ఎలా సాధ్యమవుతుందబ్బా..అని సందేహిస్తున్నారా?..అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది. డిసెంబర్ 31, 2017 రాత్రి 11:58 నిమిషాలకు బాబుకు జన్మనిచ్చింది. మరో 18 నిమిషాల్లో అంటే నూతన సంవత్సరం 2018 ప్రారంభమైన తర్వాత పాపకు జన్మనిచ్చింది. జనవరి 1, 2018న 00:16 గంటలకు పాప జన్మించింది. దీంతో వేరు వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలులుగా పిల్లలకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని చికిత్స అందించిన వైద్యులు వెల్లడించారు. బాబు పేరు జోయాక్విన్ జూనియర్ ఒంటివెరోస్ కాగా పాప పేరు ఐతానా డీ జీసస్ అని తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.   వేరు వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు..!