‘రూ.187కే అన్‌లిమిటెడ్ డేటా’

Header Banner

‘రూ.187కే అన్‌లిమిటెడ్ డేటా’

  Wed Jan 03, 2018 20:59        India, Telugu

కేంద్రప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం నూతన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28రోజుల వ్యాలిడిటీతో రూ.187కే అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1జీబీ డేటా వినియోగించుకోవచ్చు. రోజులో 1జీబీ డేటా వినియోగించిన తర్వాత కూడా 40 కేబీపీఎస్ వేగంతో అపరిమితంగా ఇంటర్‌నెట్ వాడుకోవచ్చు. ఈ ఆఫర్ 3జీ/4జీ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ముంబై, ఢిల్లీ మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లోని ఇతర నెట్ వర్క్‌లకు కూడా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టిడీ, నేషనల్ రోమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్యాక్‌లో ‘పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్’ పేరుతో ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.   ‘రూ.187కే అన్‌లిమిటెడ్ డేటా’