మెహ్రీన్‌ పార్టీ మతలబు ఇదేనా ?

Header Banner

మెహ్రీన్‌ పార్టీ మతలబు ఇదేనా ?

  Wed Jan 03, 2018 20:49        Cinemas, India, Telugu

హీరో హీరోయిన్లు పార్టీలు చేసుకోవడం మామూలే! వాటి వెనుక ఏ కారణాలు ఉండక్కర్లేదు. కానీ మెహ్రీన్‌ ఇటీవల టాలీవుడ్‌లోని హీరోలకు, దర్శకనిర్మాతలకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. పార్టీ ఎందుకిచ్చింది అంటే.. నవంబర్లలో ఆమె బర్త్‌డే జరిగిందట. ఆ సమయంలో షూటింగ్‌లో బిజీగా ఉండడంతో సెలబ్రేషన్‌ చేసుకోలేదట. దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు పార్టీ ఇచ్చిందట. ‘దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు’ ఎప్పుడో జరిగిపోయిన పుట్టినరోజుకి ఇప్పుడు పార్టీ ఏమిటి? అని చాలా ఆశ్చర్యపోయారట. కానీ దీని వెనుక ఓ కారణం ఉంది అంటున్నారు టాలీవుడ్‌ జనాలు. మెహ్రీన్‌ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. దాంతో అవకాశాల కోసం ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళడం కన్నా ఇలా పార్టీ ఇచ్చి మంచి చేసుకుంటే మంచిదని స్కెచ్‌ వేసిందని సినీ జనాలు అంటున్నారు.   మెహ్రీన్‌ పార్టీ మతలబు ఇదేనా ?