ఇండియా గేట్‌కు పోటెత్తిన జనం...

Header Banner

ఇండియా గేట్‌కు పోటెత్తిన జనం...

  Mon Jan 01, 2018 21:13        India, Telugu

ఇండియాగేట్ వద్ద జనం పోటెత్తారు. నూతన సంవత్సర వేడుకల కోసం వేలాదిగా తరలిరావడంతో ఉదయం నుంచీ ఆ ప్రాంతం జనసంద్రమైంది. మోటారిస్టుల తాకిడి కూడా ఎక్కువకావడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వారిని కంట్రోల్ చేయలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ అడ్వైజరీని కూడా విడుదల చేశారు.

 

'ఇండియా గేట్ వద్ద భారీ ట్రాఫిక్ రద్దీ ఉంది. లక్ష మంది వరకూ పాదచారులు, వాహనదారులతో కిక్కిరిసి పోయింది. చుట్టుపక్కల కూడా ఎక్కడా పార్కింగ్‌కు చోటు లేదు. వాహనదారులు ఈ వైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలిలి' అని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఓ ట్వీట్‌లో వాహనదారులను అప్రమత్తం చేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు 50 మందికి పైగా ట్రాఫిక్ పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఇండియా గేట్‌కు దారి తీసే రోడ్లు ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జామ్‌లతో కనిపిస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 


   ఇండియా గేట్‌కు పోటెత్తిన జనం...