రూ.90 లక్షల వ్యయంతో పార్క్‌ : అచ్చెన్నాయుడు

Header Banner

రూ.90 లక్షల వ్యయంతో పార్క్‌ : అచ్చెన్నాయుడు

  Mon Jan 01, 2018 21:00        India, Telugu

మానసిక ప్రశాంతతకు పార్కులు దోహదపడతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జాతీయ రహదారి పక్కన రూ.90 లక్షల వ్యయంతో కీర్తిశేషులు, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు పేరిట నిర్మించిన పార్కును సోమవారం ఆయన ప్రారంభించారు. కీర్తిశేషులు ఎన్‌టిఆర్‌, ఎర్రన్నాయుడు విగ్రహాలతోపాటు తెలుగుతల్లి, గౌతమ బుద్ధుని విగ్రహాలను ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. పార్కులోనే ప్రజలు, అభిమానులు, టిడిపి కార్యకర్తల సమక్షంలో నూతన సంవత్సర కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా కోటబమ్మాళి మండలంలోని కన్నేవలస సర్పంచ్‌ కాళ్ల గణపతి, తర్లిపేట సర్పంచ్‌ అంగ గున్నయ్యతో పాటు సుమారు వంద మంది వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, ఆర్‌డిఒ ఎం.వెంకటేశ్వరరావు, ఎంపిపి మట్ట సుందరమ్మ, జెడ్‌పిటిసి సభ్యులు కె.సుప్రియ పాల్గొన్నారు..   రూ.90 లక్షల వ్యయంతో పార్క్‌ : అచ్చెన్నాయుడు