రేప‌ట్నుంచి గుజరాత్‌, ఆంధ్ర అండర్‌-19 క్రికెట్‌ మ్యాచ్‌

Header Banner

రేప‌ట్నుంచి గుజరాత్‌, ఆంధ్ర అండర్‌-19 క్రికెట్‌ మ్యాచ్‌

  Mon Jan 01, 2018 20:56        India, Sports, Telugu

కూచ్‌బెహరా కప్‌ ట్రోఫీ సందర్భంగా అండ‌ర్‌ 19 గుజరాత్‌, ఆంధ్ర జట్ల మధ్య విజయనగరం జిల్లా చింతలవలసలోని ఎసిఎ స్టేడియంలో మంగళవారం మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్లూ ఆదివారమే చేరుకున్నాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇరుజట్ల ఆటగాళ్లూ స్టేడియంలో సోమవారం ప్రాక్టీసు ప్రారంభించారు. అకాడమీలో ఏర్పాట్లను టోర్నమెంట్‌ నిర్వాహకులు, ఎసిఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.దేవవర్మ, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.వాసుదేవరావు, స్టేడియం పరిపాలన విభాగం అధికారి జెే.త్రినాధ్‌రెడ్డి పర్యవేక్షించారు.    రేప‌ట్నుంచి గుజరాత్‌, ఆంధ్ర అండర్‌-19 క్రికెట్‌ మ్యాచ్‌