కొత్త ఏడాది తొలిరోజే.. సంచలన ప్రకటన చేసిన కిమ్‌జాంగ్

Header Banner

కొత్త ఏడాది తొలిరోజే.. సంచలన ప్రకటన చేసిన కిమ్‌జాంగ్

  Mon Jan 01, 2018 20:50        India, Telugu

‘నేను నా రూమ్‌లో కూర్చుని.. టేబుల్‌పై ఉన్న స్విచ్‌ను నొక్కితే చాలు.. అణ్వస్త్ర ప్రయోగం జరిగిపోతుంది. నా రూంలోనే అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించిన మెయిన్ స్విచ్ ఉంటుంది. ఇది నేను అమెరికాను బెదిరించేందుకు చెప్పడం లేదు.. వాస్తవాన్ని మీకు తెలియపరుస్తున్నా..’.. ఇదీ కొత్త ఏడాది సందర్భంగా ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ చేసిన ప్రసంగంలోని కీలక అంశం. 2017లో వరుస అణ్వస్త్ర పరీక్షలతో.. ఉత్తర కొరియాను న్యూక్లియర్ దేశంగా మార్చుకోగలిగామని ఆయేన స్పష్టం చేశారు. తాము చేసే ప్రతి అణ్వస్త్ర ప్రయోగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖ్య కారకులని తేల్చిచెప్పారు. తమ దేశాన్ని లేకుండా చేస్తామనీ, తనను చంపేస్తామని ఎన్నోసార్లు బెదిరించారన్నారు. తమ దేశంపై లెక్కలేనన్ని ఆంక్షలు విధించిన సంగతిని గుర్తు చేశారు. తమను తాము రక్షించుకునేందుకు మరిన్ని అణ్వస్త్ర పరీక్షలు చేస్తామని కిమ్ స్పష్టం చేశారు. అమెరికా భూభాగాన్ని చేరుకోగలిగేలా అణ్వస్త్రాలను తయారు చేయడమే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. సోమవారం తెల్లవారు జామున ఉత్తర కొరియా అధికారిక టీవీ చానెల్‌లో కిమ్‌జాంగ్ ప్రసంగం ప్రసారం అయింది.   కొత్త ఏడాది తొలిరోజే.. సంచలన ప్రకటన చేసిన కిమ్‌జాంగ్