గల్ఫ్‌లో తొలిసారి వ్యాట్‌!

Header Banner

గల్ఫ్‌లో తొలిసారి వ్యాట్‌!

  Mon Jan 01, 2018 20:48        Gulf News, India, Telugu

గల్ఫ్దేశాల్లో తొలిసారి విలు ఆధారిత పన్ను(వ్యాట్‌) అమల్లోకి రానుంది. కొత్త సంవత్సరం తొలి రోజైన సోమవారం నుంచి ఇది అమలు కానుంది. ఇప్పటి వరకు ఎలాంటి పన్ను పోటు లేకుండా హాయిగా ఉన్న గల్ఫ్వాసులు ఇకపై వ్యాట్చెల్లించాల్సిందే. పన్నుతో లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు, కార్మికుల జేబులకు చిల్లు పడనుంది. గల్ఫ్దేశాల ప్రధాన ఆదాయ వనరు చమురు ఎగుమతులే. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనమవడంతో గల్ఫ్దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

 

ఈ నేపథ్యంలో కేవలం చమురుపైనే ఆధారపడకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని రాబట్టుకోవాలనే ప్రయత్నంలో గల్ఫ్‌లోని రెండు పెద్ద దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వ్యాట్‌ను ప్రవేశపెట్టాయి. ఈ దేశాల్లో 5శాతం వ్యాట్‌ వసూలు చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీన్ని స్థానిక అరబ్బులతో పాటు విదేశీయులు ప్రత్యేకించి భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

దీనికితోడు యూఏఈలో భారతీయులను తగ్గించడానికి ఉద్దేశించిన ‘విభిన్న సంస్కృతి, నైపుణ్య కార్మికుల ఎంపిక’ అనే రెండు కీలక విధానాలు దుబాయిలో ప్రవాస భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. సౌదీ అరేబియా కూడా విదేశీయులకు ఉద్యోగాలు కల్పించిన ప్రతి సంస్థ ఒక్కో విదేశీ ఉద్యోగిపై నెలకు 300 రియాళ్ల పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ఉద్యోగులను నియమించుకొన్న సంస్ధలు, యాజమానులు ఇప్పటికే నెలకు 200 రియాళ్ల చొప్పున పన్ను చెల్లిస్తుండగా ఈ 300 రియాళ్లు అదనం.

 


   గల్ఫ్‌లో తొలిసారి వ్యాట్‌!