పోలవరం పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

Header Banner

పోలవరం పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

  Mon Jan 01, 2018 20:43        India, Telugu

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో 48వ సారి వర్చువల్ రివ్యూ జరిగింది. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 31 మధ్య 21 రోజుల పాటు జరిగిన పనులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రెండు నెలల విరామం తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం మళ్లీ తవ్వకం పనులను త్రివేణి సంస్థ తిరిగి మొదలుపెట్టిందని సీఎంకు తెలిపారు.

 

జలవనరుల శాఖ అధికారులు ఈ 21 రోజులు 6.96 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు పూర్తిచేశామని చెప్పారు. 33,523 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని సీఎంకు తెలిపారు. 84.6 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయినట్లు సీఎంకు తెలియజేశారు. ఇప్పటివరకు 760.74 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వకం పూర్తి కాగా, మరో 286.44 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు జరగాల్సి ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

 


   పోలవరం పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష