అందుకు ఫీల్ అవుతున్నానని చెప్పకనే చెప్పిన భూమిక

Header Banner

అందుకు ఫీల్ అవుతున్నానని చెప్పకనే చెప్పిన భూమిక

  Mon Jan 01, 2018 20:42        Cinemas, India, Telugu

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఖుషి', సూపర్ స్టార్ మహేష్ బాబు తో 'ఒక్కడు' లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన భూమిక ఓ విషయంలో ఫీల్ అవుతున్నానని చెప్పకనే చెప్పేసింది. ఇటీవల నాని హీరోగా వచ్చిన 'ఎంసీఏ' సినిమాలో నాని కి వదినగా నటించిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఇంటర్వ్యూలో భాగంగా ఆమెకు 'మీతో హీరోలుగా చేసిన వాళ్లంతా ఇంకా హీరోలుగానే కొనసాగుతుంటే.. మీరు మాత్రం ఇలా అక్క, వదిన పాత్రల్లో నటిచడం పట్ల మీరేమన్నా ఫీల్ అవుతున్నారా ?' అనే ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు సమాధానంగా భూమిక.. 'ఆ విషయంలో నేను ఫీల్ కావడం లేదు అని అబద్దం మాత్రం చెప్పను. పురుషాధిక్య ప్రపంచం కదండీ.. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా పరిస్థితులు మాత్రం మారటం లేదు. ఇప్పటి దర్శక నిర్మాతలు విభిన్నంగా కథలు రూపొందించి అందరికీ సమాన అవకాశాలు ఇస్తే మార్పు సాధ్యం అవుతుంది" అని చెప్పింది.   అందుకు ఫీల్ అవుతున్నానని చెప్పకనే చెప్పిన భూమిక