హైదరాబాద్ రెడీ.. మీరు రెడీనా..?

Header Banner

హైదరాబాద్ రెడీ.. మీరు రెడీనా..?

  Sun Dec 31, 2017 22:00        India, Telugu

నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌ సిద్ధమైంది. నగరంలో వందకు పైగా ఈవెంట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేడుకలు సజావుగా జరుపుకునేందుకు పోలీసుల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5వరకు ఓఆర్‌ఆర్‌ మూసివేయనున్నారు. ఎన్టీఆర్‌మార్గ్‌, నెక్లెస్‌రోడ్డులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్ల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాటుచేశారు. ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో స్పెషల్‌ క్యాబ్‌లు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మూడు కమిషనరేట్ల పరిధిలో 150 బృందాలతో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టనున్నారు. మద్యం తాగి పట్టుబడితే 15రోజుల పాటు జైలు శిక్ష విధించనున్నారు.   హైదరాబాద్ రెడీ.. మీరు రెడీనా..?