సౌదీలో మొదటి మహిళగా.. ఆమె గుర్తింపు పొందింది

Header Banner

సౌదీలో మొదటి మహిళగా.. ఆమె గుర్తింపు పొందింది

  Sun Dec 31, 2017 21:20        Gulf News, India, Telugu

సంప్రదాయం పేరుతో ఆమె ఆశయాన్ని చంపాలనుకున్నారు. అడుగడుగునా తన కసిని అణగదొక్కాలనుకున్నారు. కానీ,  తిట్టిన నోళ్లతోనే ఆమె శభాష్ అనిపించుకుంది. మహిళకు ఇలాంటి క్రీడాలెందుకు అన్నవాళ్లే ఆమె దగ్గర తమ పిల్లలను ట్రైనింగ్ కోసం పంపుతున్నారు. అంతర్జాతీయంగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు  సౌదీ తొలి మహిళ కిక్ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. ఆమె పేరు హల్లా అల్ హర్మానీ అయితే మత విశ్వాసాలను గౌరవిస్తూనే బాక్సర్‌గా హర్మానీ చరిత్ర సృష్టించింది. ఆమెకు సొంతంగా జిమ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. అక్కడే రోజు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంది.

హర్మానీ సర్టిఫైడ్ కిక్ బాక్సర్‌గా నేషనల్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్(నాస్మ్) అనే అమెరికా సంస్థ ద్వారా గుర్తింపు పొందింది. హర్మానీ తండ్రి సౌదీకి చెందినవాడు. తల్లి మాత్రం అమెరికన్ కావడం వల్లే తాను బాక్సర్‌ అయ్యాయనని హర్మానీ చెప్పింది. తన తండ్రి సౌదీ పౌరుడు కావడం వల్ల బాక్సర్‌ అవుతానంటే మొదట్లో వ్యతిరేకించాడని హర్మానీ తెలిపింది. తన తండ్రితో పాటు బంధువులు కూడా వ్యతిరేకించారని హర్మానీ చెప్పింది.

 


   సౌదీలో మొదటి మహిళగా.. ఆమె గుర్తింపు పొందింది