దుబాయ్ వెళ్లిన తెలు‘గోడు’ వింటే కన్నీళ్లే....

Header Banner

దుబాయ్ వెళ్లిన తెలు‘గోడు’ వింటే కన్నీళ్లే....

  Sun Dec 31, 2017 21:18        Gulf News, India, Telugu

దుబాయ్‌లో ఉద్యోగానికి వెళ్లి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి. అప్పుచేసి బతుకుదెరువుకోసం పొరుగుదేశం వెళ్లి పాట్లుపడుతున్న కరీంనగర్ అభాగ్యుడి కడగండ్లపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం.కష్టాలను వెళ్లబోసుకుంటూ అభాగ్యుడి పేరు మధు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామవాసి. బతుకుదెరుకోసం లక్షాపదివేలు అప్పు తీసుకొని ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. అక్కడ స్టార్ స్ర్పింగ్ కంపెనీలో పనికి చేరారు. కానీ వెళ్లిన రెండు నెలలకే మధుకి తత్వం బోధపడింది. తను మోసపోయినట్లు గ్రహించాడు.

ఒప్పందం ప్రకారం జీతం ఇవ్వకుండా కంపెనీ మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు కంపెనీ తరపున ఇన్సూరెన్స్ కూడా లేదని వాపోయాడు. మధు నానాపాట్లు పడుతున్నట్లు తెలిపారు. తనలాగే చాలా మంది అక్కడ కష్టాలు పడుతున్నట్లు చెప్పారు. అంతేకాదు తనని పనిలోకి కుదుర్చుకున్న యజమానితో మధు సంభాషించిన ఫోన్ ఆడియోను ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి అందజేశారు. ఫోన్‌లో మధు ఆవేదన విన్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మధుని ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.

 


   దుబాయ్ వెళ్లిన తెలు‘గోడు’ వింటే కన్నీళ్లే....