సౌదీ మహిళలకు గుడ్‌న్యూస్..వచ్చే నెలలోనే..

Header Banner

సౌదీ మహిళలకు గుడ్‌న్యూస్..వచ్చే నెలలోనే..

  Wed Dec 27, 2017 21:52        Gulf News, India, Telugu

సౌదీఅరేబియా చరిత్రలో మొదటిసారిగా ఓ కొత్త దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌదీకి చెందిన మహిళలు మొదటిసారిగా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను స్టేడియంలోనే ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. జనవరి 12న అల్-హిలాల్, అల్-ఇట్టిహద్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌కు రియాద్ నగరంలోని కింగ్ ఫద్ స్టేడియం వేదికకానుంది. మహిళలు క్రీడా మైదానాల్లోకి ప్రవేశించరాదనే నిషేధాన్ని తొలగిస్తున్నామని అక్టోబర్ నెలలోనే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిసారిగా సౌదీ మహిళలు ఓ మైదానంలో జనవరి నెలలో ప్రత్యక్షంగా ఆటను వీక్షించి ఆస్వాదించనున్నారు. ఇదిలావుండగా సౌదీ మహిళలపై ఉన్న పలు రకాల ఆంక్షలు, నిషేధాలను ప్రభుత్వం తొలగిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచే వాహనాలను కూడా డ్రైవింగ్ చేయనున్నారు.   సౌదీ మహిళలకు గుడ్‌న్యూస్..వచ్చే నెలలోనే..