ఈ సక్సెస్‌ల వెనుక ఉంది వాళ్లే: దిల్ రాజు

Header Banner

ఈ సక్సెస్‌ల వెనుక ఉంది వాళ్లే: దిల్ రాజు

  Tue Dec 26, 2017 21:00        Cinemas, India, Telugu

నిర్మాత దిల్ రాజు 2017 సంవత్సరానికి గానూ డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఎస్.వి.సి. సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. తమ సంస్థకి డబుల్ హ్యాట్రిక్‌ని ఇచ్చిన చిత్రాల యూనిట్‌ని ఈ వేడుకకి పిలిచి వారిని ఈ కార్యక్రమంలో సత్కరించారు.

 

దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘ఒక ఏడాది ఇన్ని సినిమాలు చేయ‌డం మామూలు విష‌యం కాదు. ఈ స‌క్సెస్‌లు రావ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ కార‌ణం. అంద‌రూ అలా ఉన్నారు కాబ‌ట్టే మాకు ఇన్ని స‌క్సెస్‌లు వ‌చ్చాయి. 1987 డిసెంబ‌ర్‌లో నా జీవితం మొద‌లైంది. ఒక సూట్‌కేస్ ప‌ట్టుకుని ఆటోమొబైల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవ‌డానికి బ‌య‌లుదేరాను. 1987, 1997, ఇప్పుడు 2017.. అన్నిటికి ఏదో ఇంట‌ర్‌లింక్ ఉన్న‌ట్టు అనిపిస్తోంది. సినిమాల మీద ఆస‌క్తితో మేం ఇండ‌స్ట్రీలోకి రావ‌డం, బిగినింగ్‌లో ఫెయిల్యూర్స్... 20 ఏళ్ల క్రితం మా జీవితంలో గ్రేట్ డే స‌క్సెస్ తెచ్చిన సినిమా పెళ్లిపందిరి. ఆ సినిమా కొన్న‌ప్ప‌టి నుంచి రిలీజ్ వ‌ర‌కు ఎంత క‌ష్ట‌ప‌డ్డామో మాకు, మా ఫ్యామిలీస్‌కి తెలుసు. సినిమా విడుద‌ల రోజు రూ.3ల‌క్ష‌లు త‌క్కువ ఉంటే షాప్‌లు తిరిగి క‌ట్టాం. కోడి రామ‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబుగారుకి థాంక్స్. ఆ సినిమా లేకుంటే మేము లేము. ఆ సినిమా ద్వారానే ఇక్క‌డి వ‌ర‌కు రాగ‌లిగాం.

 

ఆ త‌ర్వాత డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్ పెట్టాక చాలా మంది నిర్మాత‌లు మంచి సినిమాలు ఇచ్చారు. ఎన్నో సినిమాల‌తో అనుభ‌వం ఉన్న మేం ప్రొడ‌క్ష‌న్‌లోకి వ‌చ్చాం. వినాయ‌క్‌తో దిల్ చేశాం. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాం. దిల్ ద్వారా పుట్టిన సుకుమార్, బోయ‌పాటి శ్రీను, భాస్క‌ర్, వంశీ, శ్రీకాంత్ అడ్డాల‌, వేణు.. ఇలా ఎనిమిది మందిని ప‌రిచ‌యం చేశాం. ఒక్క ద‌ర్శ‌కుడు త‌ప్ప మిగిలిన వాళ్లంద‌రూ స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కులే. ఈ ఇయ‌ర్ మా సంస్థ‌కు రెండు హ్యాట్రిక్‌లు వ‌స్తాయ‌ని నేను అనుకోలేదు. ఆరు సినిమాలు వ‌స్తాయ‌ని నేను కూడా అనుకోలేదు. భ‌గ‌వంతుడు ఇలా డిజైన్ చేశారు. `శ‌త‌మానం భ‌వ‌తి`, `నేను లోక‌ల్‌` త‌ర్వాత అంద‌రికీ తెలిసిందే.. అప్ప‌టికి ప్లాన్డ్‌గా ఉన్నాను. మిగిలిన సినిమాల‌న్నీ ప్లాన్‌గా చేశాము. ఆరు సినిమాలు క‌నిపిస్తున్నాయి. వాట‌న్నిటినీ హిట్ చేయాల‌ని అంద‌రం ప్లాన్ చేసుకుంటున్నాం. డీజే షూటింగ్ జ‌రుగుతుంటే అబుదాబీకి వెళ్లాను. అక్క‌డి నుంచి ఫారిన్ వెళ్లాలి. ఫిదా అప్ప‌టికి రెండు షాట్‌లు చూశాను. ఫ్లైట్ దిగుతుంటే... అస‌లు ఏం జ‌రుగుతుందో, ఎలా అవుతుందో నాకు తెలియ‌లేదు. ఎక్క‌డ డ్రాప్ అవుతానోన‌ని అనుకున్నా.

 

గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్రెండ్స్ లేకుంటే జీవితంలో మ‌నం ముందుకు వెళ్ల‌లేం. ఈ ఆరు స‌క్సెస్‌ల వెన‌కాల నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్యామిలీ ఉంది. ఎంద‌రో నాకు ఈ ఏడెనిమిది నెల‌ల నుంచి మోర‌ల్ స‌పోర్ట్ ఇచ్చారు. దాంతోనే నేను సాధించాను. ఇది నేను కాదు. వంశీ అంద‌రికీ డైర‌క్ట‌ర్‌గా తెలుసు. కానీ త‌ను నాకు ఫ్యామిలీ మెంబ‌ర్. వంశీ, ప్ర‌కాశ్‌రాజ్‌గారు, మ‌రో ఫ్రెండ్ న‌న్ను మోర‌ల్‌గా స‌పోర్ట్ చేశారు. స‌క్సెస్ ఉన్న‌ప్పుడు అంద‌రూ పొగుడుతారు అది కామ‌నే. సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ అంద‌రినీ నిల‌బెడుతుంది. కానీ ఫెయిల్యూర్ ఉన్న‌ప్పుడే మోర‌ల్ స‌పోర్ట్ కావాలి. స‌క్సెస్ ఉన్న‌వాళ్ల‌తో సినిమాలు చేస్తే అది ఆటోమేటిగ్గా వ‌చ్చేస్తుంది.

 

ఇది ఆరు సినిమాల‌నే ఈవెంట్‌లాగానే చేద్దామ‌నుక‌న్నా. కానీ ఎమోష‌న‌ల్ డ్రైవ్ అయిపోయింది. నాకు మా ఆవిడ గురించి తెలియ‌గానే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది శేఖ‌ర్‌గారు. అక్క‌డినుంచి నేను వ‌చ్చేశాను. యు.ఎస్‌.లో కంప్లీట్ చేసుకుని వ‌చ్చారు కాబ‌ట్టి అది క్లాసిక్ అయింది. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ బ్ల‌డ్‌, హార్ట్ పెట్టి ప‌నిచేశారు. నా డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను సొంత మ‌నుషుల్లాగా చూస్తాను. వాళ్లు సినిమాల‌ను ప్ర‌మోట్ చేసి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు అయ్యేలా చేశారు. ఒక సినిమా ఊరికే వ‌చ్చేయ‌దు. ఒక ట్యూన్ వ‌చ్చినా, సినిమా ఎవ‌రైనా డ‌బుల్ పాజిటివ్‌గా చూసినా నేను గేట్ కీప‌ర్‌లాగా కూర్చుంటాను. అక్క‌డే నాకు రియాక్ష‌న్ తెలుసుకుంటాను. తొలి రియాక్ష‌నే సినిమా. అక్క‌డే తెలిసిపోద్ది. ఒక‌వేళ సినిమా బాగోలేక‌పోతే వాళ్ల రియాక్ష‌న్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ ఆరు సినిమాలు మావి కాదు. వీటికి ప‌నిచేసిన టెక్నీషియ‌న్ల‌వి. ఈ ఈవెంట్ అందుకే అలా చేయాల‌నుకున్నా..’’ అని చెప్పారు.

 


   ఈ సక్సెస్‌ల వెనుక ఉంది వాళ్లే: దిల్ రాజు