శాంతాక్లాజ్ టోపీలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న టీమిండియా క్రికెటర్లు

Header Banner

శాంతాక్లాజ్ టోపీలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న టీమిండియా క్రికెటర్లు

  Mon Dec 25, 2017 22:15        India, Sports, Telugu

టీమిండియా ఆటగాళ్లు క్రిస్మస్ పర్వదినాన్ని శాంతాక్లాజ్ టోపీలు ధరించి అట్టహాసంగా జరుపుకున్నారు. శాంతాక్లాజ్ టోపీలను ధరించిన ఆటగాళ్లు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శాంతాక్లాజ్ టోపీలతో ట్రోఫీని పట్టుకుని ఫొటోలకు పోజిచ్చారు. శ్రీలంకపై విజయంతో 2017ను భారత్ ఘనంగా ముగించినట్టయ్యింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఈ ఏడాది 37 విజయాలు సాధించి ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. 38 విజయాలతో ఆస్ట్రేలియాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2003లో ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించింది.   శాంతాక్లాజ్ టోపీలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న టీమిండియా క్రికెటర్లు