రూ.1,600 కోట్లతో అమరావతిలో మెడిసిటీ

Header Banner

రూ.1,600 కోట్లతో అమరావతిలో మెడిసిటీ

  Thu Dec 21, 2017 22:03        అమరావతి కబుర్లు, India, Telugu

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో భారీ ప్రాజెక్టు రానుంది. ఇండో యుకె ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయుఐహెచ్‌) అనే సంస్థ అమరావతిలో రూ.1,600 కోట్ల పెట్టుబడితో మెడిసిటీ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన భూములు అప్పగిస్తే వెంటనే మెడిసిటీ నిర్మాణం చేపడతామని ఐయుఐహెచ్‌ గ్రూప్‌ ఎండి, సిఇఒ డాక్టర్‌ అజయ్‌ రాజన్‌ గుప్తా చెప్పారు. ఐయుఐహెచ్‌ గ్రూప్‌ దేశంలోని 11 రాష్ట్రాల్లో 11 మెడిసిటీలు ఏర్పాటు చేయబోతోంది.

 

వీటన్నిటికి అమరావతి మెడిసిటీ ప్రధాన కార్యాలయం కానుంది. ఈ మెడిసిటీలో క్లినిక్‌, డయాగ్నిస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే వచ్చే సంవత్సరం గాంధీ జయంతి రోజు సిఎం చంద్రబాబు నాయుడు ద్వారా ప్రారంబింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గుప్తా చెప్పారు. ఈ మెడిసిటీ తొలి దశలో 2020 నాటికి 250 పడకలతో ఒక హాస్పిటల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. 2022 నాటికి ఎన్‌హెచ్‌ఎస్‌ బ్రాండ్‌ పేరుతో వెయ్యు పడకలతో కింగ్స్‌ కాలేజి హాస్పిటల్‌తో పాటు, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ఐయుఐహెచ్‌ గ్రూప్‌ భావిస్తోంది.

 


   రూ.1,600 కోట్లతో అమరావతిలో మెడిసిటీ