బాలిస్టిక్ క్షిపణి ఇరాన్‌దే: అమెరికా

Header Banner

బాలిస్టిక్ క్షిపణి ఇరాన్‌దే: అమెరికా

  Wed Dec 20, 2017 21:05        Gulf News, India, Telugu

మంగళవారం సౌదీ ప్రభుత్వాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన బాలిస్టిక్ క్షిపణి కూల్చివేత ఘటనపై అమెరికా స్పందించింది. కింగ్ సాల్మాన్ ప్యాలెస్‌పై దాడి చేసేందుకు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు కుట్రపన్నారని వెల్లడించింది. ‘వొల్కెనో హెచ్-2’ అనే బాలిస్టిక్ క్షిపణిని తిరుగుబాటుదారులకు ఇరాన్ సరఫరా చేసిందని చెపుతోంది. ఈ ఘటనతో సౌదీ, ఇరాన్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత చెలరేగుతోందని, మధ్య ఆసియా ప్రాంతంలో అశాంతికి కారణమవనుందని ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి నిక్కీ హేలీ హెచ్చరించారు. ఇదిలావుండగా సౌదీ నేతలు సమావేశమవనున్న ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటుదారులు బాలిస్టిక్ క్షిపణిని మంగళవారం ప్రయోగించారు. అప్రమత్తమైన సౌదీ దళాలు.. కేవలం సెకన్ల వ్యవధిలోనే క్షిపణిని కూల్చివేయడంతో పెనుప్రమాదం తప్పింది. రియాద్ నగరానికి వాయువ్య దిశలో క్షిపణిని పేల్చివేయడాన్ని తాము చూశామని అనేకమంది పౌరులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.    బాలిస్టిక్ క్షిపణి ఇరాన్‌దే: అమెరికా