చంద్రబాబుతో ‘పరువు కోసం’ అనే నాటకం వేశానంటున్న ఎంపీ

Header Banner

చంద్రబాబుతో ‘పరువు కోసం’ అనే నాటకం వేశానంటున్న ఎంపీ

  Wed Dec 13, 2017 22:24        India, Telugu

మూడు దశాబ్దాలుకు పైగా సినీ, రాజకీయ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు డా. శివప్రసాద్‌. డాక్టర్‌గా, యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ.. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శివప్రసాద్‌ ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు ఎన్నో సంపాదించుకున్నారు. రీసెంట్‌గా 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' చిత్రంలో జడ్జి క్యారెక్టర్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా రెండోవారంలోకి ఎంటర్‌ అయ్యింది. కామెడీ కింగ్‌ సప్తగిరి హీరోగా, కశిష్‌ వోరా హీరోయిన్‌గా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా. రవికిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు, ఎం.పి. డా. శివప్రసాద్‌ తన ఆనందాన్ని తెలియజేశారు.

 

ఆయన మాట్లాడుతూ.. ‘‘మాది చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ప్రక్కన పురిత్తివారిపల్లి. ఓ మారుమూల గ్రామం. పక్కా పల్లెటూరు. చుట్టూ పంట పొలాలు మధ్యలో మా ఊరు ఉంటుంది. ప్రొద్దునే లేవగానే పొలంలో నారు నాటుతూ, నేతం వేసి నీళ్ళు తోడుతూ పాటలు పాడేవారు. సాయంత్రం కోలాటాలు, చెక్క భజనలు వేసేవారు. అవన్నీ చూస్తూ పెరిగాను. ఆ సౌండింగ్‌ అంతా నా మైండ్‌లో పడింది. ఫస్ట్‌ ఒకసారి వీధి నాటకాలు వేస్తుంటే అందులో నేను పార్టిసిపేట్‌ చేయడం జరిగింది. హైస్కూల్‌లో ఓ మాస్టారు సంగీతం, డ్రామాలు డైరెక్ట్‌ చేసేవారు. ఆరో తరగతి నుండి మాకు అవకాశాలు వచ్చాయి. నేను బాగా పాడేవాడ్ని. యాక్ట్‌ చేసేవాడ్ని. ఫ్యాన్సీ డ్రెస్సులు వేసి స్టైల్‌గా వుండేవాడ్ని. అన్నింట్లో ముందుండేవాడ్ని. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చంద్రబాబునాయుడు, నేను ఇద్దరం క్లాస్‌మేట్స్‌. మేం ఇద్దరం కలిసి 'పరువు కోసం' అనే ఒక నాటిక వేశాం. అందులో చంద్రబాబు హీరో. నేను కమెడియన్‌గా చేశా.

 

హైస్కూల్‌ తర్వాత నేను మెడిసిన్‌లోకి వెళ్ళాను. ఆ కాలంలో మెడిసిన్‌ సబ్జెక్ట్‌లు చాలా స్ట్రిక్ట్‌గా వుండేవి. ప్రొఫెసర్స్‌ అందరూ ఆర్ట్‌ గురించి ఇంట్రెస్ట్‌గా వుండేవారు. ప్రాక్టీస్‌ అప్పుడే డైలాగ్స్‌ చెప్పించుకుని బాగా ఎంకరేజ్‌ చేసేవారు. చిన్నప్పటి నుండి మెడిసిన్‌ వరకు కల్చరల్‌ యాక్టివిటీస్‌లో మమేకమై వున్నాను. మెడిసిన్‌లో వుండగానే మ్యారేజ్‌ అయ్యింది. నా మిసెస్‌ కూడా డాక్టర్‌. మేం ఇద్దరం ప్రాక్టీస్‌ పెట్టాక సి.ఎం. కృష్ణ, ఎడిటర్‌ మోహన్‌ వచ్చి డ్రామాలు డైరెక్షన్‌ చెయ్యాలి అని అడిగారు. ఆ టైమ్‌లో నేను కాలేజ్‌లో జాబ్‌ చేస్తూ, కల్చరల్‌ ప్రోగ్రాంస్‌కి నన్నే డైరెక్టర్‌గా అప్పాయింట్‌ చేశారు. కాలేజ్‌లో కొన్ని గ్రూప్స్‌ తయారు చేసి స్టేట్‌ అంతా తిరిగాం..’’ అని తెలిపారు.

 


   చంద్రబాబుతో ‘పరువు కోసం’ అనే నాటకం వేశానంటున్న ఎంపీ