తన భార్య వేరొకరిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్న సౌదీ భర్త...

Header Banner

తన భార్య వేరొకరిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్న సౌదీ భర్త...

  Wed Dec 13, 2017 22:17        India, Kuwait, Telugu

ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న భర్తల గురించి నిత్యం చూస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి విషయాల్లో మహిళల గురించి వార్తలు వస్తుంటాయి. తాజాగా సౌదీలో వింత సంఘటన జరిగింది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని.. మహిళ వార్తల్లోకెక్కింది. రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్న జంట జెడ్డాహ్లో నివసిస్తోంది. అయితే భర్తకు అనుకోని కారణాల వల్ల వేరే చోటికి ఉద్యోగం ట్రాన్ఫర్ అయింది. భార్యను తనతోపాటు తీసుకుని వెళ్లే వీలు లేకపోవడంతో ఆమెను పుట్టింటికి పంపాడు. 

 

అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో.. భర్తకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘నీ భార్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కావాలంటే వాళ్లింటికి రహస్యంగా వెళ్లి చూడు’.. అంటూ సమాచారం అందించాడు. అంతేకాకుండా భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. దీంతో అతడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కొన్నాడు. అతడు పెళ్లి చేసుకున్నది తన భార్యనే అని తేలడంతో ఒక్కసారిగా ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. మోసపోయామంటూ ఇద్దరు భర్తలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇద్దర్నీ పెళ్లి చేసుకున్న ఆమెకు బదులు.. ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

సౌదీ చట్టాల ప్రకారం తండ్రి, సంరక్షకుడి అనుమతి లేకుండా యువతులకు పెళ్లి కాదు. తండ్రి అనుమతితోనే ఆమె పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా రెండో భర్తకు మొదటి పెళ్లి గురించి ఏమాత్రం తెలియనీయలేదు. తమ కుమార్తెకు ఇదే మొదటిపెళ్లి అని రెండో భర్తకు తండ్రి చెప్పాడు కూడా. దీంతో తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

 

 


   తన భార్య వేరొకరిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్న సౌదీ భర్త...