సౌదీలోని వసలదారులకు పండగలాంటి వార్త..

Header Banner

సౌదీలోని వసలదారులకు పండగలాంటి వార్త..

  Wed Dec 13, 2017 22:09        India, Telugu

పొట్టకూటి కోసం విదేశాల నుంచి వలస వచ్చేవారికి సౌదీ అరేబియా ప్రభుత్వం పండగలాంటి వార్త చెప్పింది. యజమాని మోసం, అరకొర జీతం.. వంటి ఆరోపణలకు, అన్యాయాలకు చెక్ పెట్టేందుకు వినూత్న పథకాన్ని తేబోతోంది. ‘ప్రీపెయిడ్ శాలరీ కార్డు’ల పేరిట వినూత్న ప్రయోగానికి సౌదీ శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రతి ఒక్క సౌదీ యజమాని ఆరు నెలల్లోగా ప్రీపెయిడ్ శాలరీ కార్డులను తీసుకోవాలనీ, వాటిని తమ తమ పనిమనుషులకు ఇవ్వాలని సౌదీ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సూచించింది. పనిమనిషి గురించిన అన్ని వివరాలను నమోదు చేయించి ఈ కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని పనిమనుషులకు ఇస్తుంటారు. యజమాని బ్యాంకు ఖాతా నుంచి నేరుగా ప్రతి నెలా జీతం ఆ కార్డుల్లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంటుంది. వాటిని పనిమనుషులు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. 

 

ఇప్పటివరకు ఎక్కువ శాతం యజమానులు జీతాలను నేరుగా పనిమనిషికే ఇస్తుండేవారు. అగ్రిమెంట్లలో ఓ విధంగా.. ఇచ్చేటప్పుడు మరో విధంగా జీతాల్లో వ్యత్యాసాలు ఉండేవి. అంతేకాకుండా కొన్నాళ్లపాటు అసలు జీతమే ఇవ్వకుండా పనిచేయించుకుని వలసదారులను ఇక్కట్లకు గురిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నూతన విధానానికి పచ్చజెండా ఊపింది. ఈ విధానం సరిగా అమలయితే.. సౌదీకి వలస వెళ్లేవారికి పండగే పండగ. 

 

 


   సౌదీలోని వసలదారులకు పండగలాంటి వార్త..