‘దేవుడు ఆదేశించాడు.. ట్రంప్‌ను చంపేస్తా’

Header Banner

‘దేవుడు ఆదేశించాడు.. ట్రంప్‌ను చంపేస్తా’

  Wed Dec 13, 2017 21:52        India, Telugu

దేవుడు ఆదేశించాడు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చంపమని దేవుడు ఆదేశించాడు. నేను ట్రంప్‌ను చంపేస్తాను. కానీ నా వల్ల అవుతుందో లేదో.. నువ్వు నాకు సాయం చేయాలి.. ప్లీజ్ అమ్మా నాకు సాయం చేయి’.. అంటూ ఓ తల్లిని 46 ఏళ్ల వ్యక్తి కోరాడు. ఓహియోకు చెందిన 46 ఏళ్ల లీ గెస్సీ అనే వ్యక్తి కొంత కాలంగా ట్రంప్‌ను చంపేస్తాను అంటూ తిరిగేవాడు. తనకు దేవుడు చెప్పాడనీ, అందుకే ట్రంప్‌ను చంపేస్తానని అనేవాడు. దీంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. లీ గురించి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. తన ఇంటికి పోలీసులు వస్తున్నారనగానే లీ బెదిరిపోయాడు. ఇంటి తలుపులు వేసుకున్నాడు. తలుపులను పగలగొట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    ‘దేవుడు ఆదేశించాడు.. ట్రంప్‌ను చంపేస్తా’