ఆరేళ్ల బాలుడు.. ఏడాదికి రూ.70 కోట్లు సంపాదిస్తున్నాడు

Header Banner

ఆరేళ్ల బాలుడు.. ఏడాదికి రూ.70 కోట్లు సంపాదిస్తున్నాడు

  Wed Dec 13, 2017 21:31        India, Telugu

 


ఫోటోలో కనిపిస్తున్న బాలుడి పేరు రియాన్. వయసు సరిగ్గా ఆరేళ్లు. సంపాదన చూస్తే ఏకంగా 70 కోట్ల రూపాయలు.. సాధారణంగా అయితే స్కూల్లో పుస్తకాలను కుస్తీ పడుతూ ఉండాల్సిన వయసు. కానీ వయసుకు మించిన పనులు చేస్తూ.. ఏకంగా ఫోర్భ్స్ లిస్ట్లో స్థానం సంపాదించాడు. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన బాలుడు.. చేస్తున్నదేమిటో తెలిస్తే.. వారెవ్వా అంటారు. 

చిన్నప్పటి నుంచే రియాన్‌ను, అల్లరి చేష్టలను వీడియోలు తీయడం అతడి తల్లిదండ్రులకు అలవాటుగా మారింది. ఆ వీడియోలను చూసి తాము మాత్రమే ఆనందపడకుండా.. ప్రపంచానికి రియాన్‌ను పరిచయం చేయాలనుకున్నారు. దీంతో రియాన్ పేరు మీద ఓ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు. ఆ వీడియోలను ఆ చానెల్‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి రియాన్ వీడియోలను ప్రపంచ నెటిజన్లు తెగ వీక్షిస్తున్నారు. ఎంతగా అంటే 2016వ సంవత్సరం జూన్ నెల నుంచి 2017 జూన్ నెల వరకు.. అంటే సరిగ్గా ఏడాది సమయంలో అతడి పేరుమీదున్న యూట్యూబ్ చానెల్‌కు ఏకంగా 11 మిలియన్ డాలర్లు.. అంటే 70 కోట్ల 88 లక్షల 67వేల రూపాయల రెవెన్యూ వచ్చేంతగా.. 

 

టాయ్స్, కార్టూన్స్.. ఇలా ఒకటేమిటి.. అన్ని రకాలుగా యూట్యూబ్‌లో వరుస వీడియోలతో రియాన్ హల్‌చల్ చేస్తుంటాడు. ‘రియాన్స్ టాయ్స్ రివ్యూ’ అనే పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్‌కు ఇప్పటికే పది మిలియన్ల మంది.. అంటే అక్షరాలా కోటి మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 2015 మార్చిలో ప్రారంభమయిన ఈ చానెల్‌కు ఇప్పటివరకు 1694 కోట్ల 68 లక్షల 56వేల వివ్స్ వచ్చాయి. ఈ యూట్యూబ్ చానెల్‌లో ఉన్న వీడియోల్లో ప్రతి ఒక్కదానికి ఒక మిలియన్‌కు పైగానే వివ్స్ ఉన్నాయంటే.. రియాన్ క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతేడాది యూట్యూబ్ నుంచి అత్యధిక ఆదాయం సంపాదించిన వాళ్లలో రియాన్ కూడా ఉన్నాడు. ఈ బాలుడి తల్లిదండ్రుల పేర్లను మాత్రం వెల్లడించేందుకు ఇష్టపడలేదు. 

 

 


   ఆరేళ్ల బాలుడు.. ఏడాదికి రూ.70 కోట్లు సంపాదిస్తున్నాడు