కొన్నిరోజుల్లో చనిపోబోతూ.. అందరికీ పార్టీ ఇచ్చాడు

Header Banner

కొన్నిరోజుల్లో చనిపోబోతూ.. అందరికీ పార్టీ ఇచ్చాడు

  Tue Dec 12, 2017 22:33        India, Telugu

సాధారణం కొన్ని రోజులు చనిపోతామని వార్త తెలిస్తే.. ఎవరైనా సరే దిగులుతో కృంగిపోతారు. కానీ క్యానర్స్ వ్యాధితో మరి కొన్ని రోజుల్లో చనిపోతానని తెలిసి కూడా ఓ పెద్దాయిన దాదాపు 1000 మందిని పిలిచి పార్టీ ఇచ్చాడు. జపాన్‌కి చెందిన సటోరు అన్జాకీ అనే వ్యాపారవేత్త గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే తను కొద్ది రోజుల్లో చనిపోతానని తెలసిన సుటోరు తన కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు, బిజినెస్ పార్ట్‌నర్లు, ఉద్యోగులు ఇలా దాదాపు వెయ్యి మందిని పిలిచి పార్టీ ఇచ్చారు. అంతేకాక పార్టీకి సంబంధించి ప్రకటనలు పేపర్లలో వేయించారు. పార్టీ కోసం సటోరు ఓ ఫైవ్‌స్టార్ హోటల్ బుక్ చేసి, అక్కడ తన జ్ఞాపకాలను అలంకరించాడు. తన జీవితంలో తనతో పాటు కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపాలని అనుకున్నానని, అందుకే ఈ పార్టీ ఏర్పాటు చేశానని తెలిపారు. దీంతో సటోరు పేరు జపాన్‌లో వైరల్ అయింది. తాను చనిపోతానని బాధపడకుండా.. అందరిని సంతోషంగా ఉంచేందుకు సటోరు ప్రయత్నించడాన్ని అందరూ అభినందిస్తున్నారు.   కొన్నిరోజుల్లో చనిపోబోతూ.. అందరికీ పార్టీ ఇచ్చాడు