ఆ విధంగా ఆడితే సిరీస్ మాదే.. శ్రీలంక కెప్టెన్ ధీమా

Header Banner

ఆ విధంగా ఆడితే సిరీస్ మాదే.. శ్రీలంక కెప్టెన్ ధీమా

  Tue Dec 12, 2017 21:30        India, Sports, Telugu

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింన విషయం తెలిసిందే. అయితే ఈ విజయంపై శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్ తిషారా పెరీరా తొలి వన్డేలో విజయం తమకి సిరీస్ గెలిచేందుకు ఓ మంచి అవకాశమని అన్నారు. ‘భారత్‌కు టూర్ వచ్చిన జట్లు చాలా వరకు సిరీస్‌లు గెలువలేకపోయాయి, కానీ మేం ధర్మశాలలో ఆడి ఏదైనా ప్రత్యేకంగా సాధిస్తాం’ అని అన్నారు. బుధవారం రెండో వన్డే జరుగనున్న నేపథ్యంలో ఆయన తమ జట్టు ప్రదర్శనపై ధీమా వ్యక్తం చేశారు. మా జట్టుపై ఎటువంటి ఒత్తిడి లేదు. రేపు మ్యాచ్ గెలిస్తే.. ఈ సిరీస్ మేం కైవసం చేసుకుంటామని అందరికీ తెలుసు.. అందుకోసం మేం 200శాతం కష్టపడతాం’’ అని పేర్కొన్నారు.

 

ఇక మొహాలీ పిచ్‌ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉందని, ఇక జట్టు విషయానికొస్తే.. ధనుంజయ డి సెల్వ ఫిట్‌గా లేడని, అందుకే అతనికి విరామం కల్పించామని తెలిపారు. ఇక భారత ఆటగాడు అజింక్యా రహానే గురించి ప్రశ్నించగా.. ‘‘నేను భారత జట్టు సెలెక్టర్‌ని కాదు.. అతను ఎందుకు బాగా ఆడటంలేదో చెప్పడానికి. నాకు తెలిసింది ఒకటే అతను ఓ మంచి బ్యాట్స్‌మెన్. అంతకు మించి నేను ఏం చెప్పలేను’’ అని అన్నారు.


   ఆ విధంగా ఆడితే సిరీస్ మాదే.. శ్రీలంక కెప్టెన్ ధీమా