కారుంటే గ్యాస్ సబ్సిడీ కట్..

Header Banner

కారుంటే గ్యాస్ సబ్సిడీ కట్..

  Sun Dec 10, 2017 22:09        India, Telugu

దేశవ్యాప్తంగా ఉన్న 3.6 కోట్ల నకిలీ వంట గ్యాస్ కనెక్షన్లను తొలగించినట్లు డీబీటీఎల్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి రూ. 30,000 కోట్ల వంటగ్యాస్ సబ్సిడీ మిగిలింది. కారు ఉన్న వారు వంట గ్యాస్ సబ్సిడీని వదులుకోవాల్సిందే. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ నుంచి మినహాయించింది. ఆర్టీవో కార్యాలయాల నుంచి ప్రభుత్వం కార్ల రిజిస్ట్రేషన్ వివరాలు సేకరిస్తోంది. కొంత మంది వినియోగదారులు 3,2 కార్లు ఉన్నా కూడా గ్యాస్ సబ్సిడీని పొందుతున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్ల వివరాలు సేకరించిన అనంతరం గ్యాస్ సబ్సిడీ తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 75 లక్షల నకిలీ కనెక్షన్లను గుర్తించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.   కారుంటే గ్యాస్ సబ్సిడీ కట్..