'అణు యుద్ధం జరగకూడదు'

Header Banner

'అణు యుద్ధం జరగకూడదు'

  Sun Dec 10, 2017 21:34        India, Telugu

అణు యుద్ధమంటూ ప్రపంచదేశాల ప్రజలను ఆందోళనకు గురిచేయడం వెంటనే ఆపాలని జపాన్ మాజీ సైనికాధికారి సెస్టికో త్రూలో(85) అమెరికా, ఉత్తరకొరియాల అధ్యక్షులను కోరారు. అమెరికా హీరోషిమాపై అణుబాంబు వేసినప్పుడు తమ కుటుంబం ఎదుర్కొన్న భయానక దృశ్యాలను తాను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని ఆయన తెలిపాడు. భూమి మీద మనిషి తట్టుకోలేని కష్టం ఆ సమయంలో తమ కుటుంబంతోపాటు అక్కడున్న ప్రజలందరూ ఎదుర్కొన్నారని త్రూలో ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు తన వయసు 13 సంవత్సరాలని త్రూలో చెప్పాడు. భయంకరమైన ఆ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తప్పించుకుని సైన్యంలో చేరానన్నాడు అణుదాడి జరిగిన ప్రదేశంలో పంటలు పండలేదన్నాడు. దాంతో ప్రజలకు తిండి దొరకలేదని త్రూలో చెప్పాడు. హిరోషిమాలో ఎంతో మంది శవాలు గుట్టలుగా పేరుకుపోయాయని ఆ రోజులను త్రూలో గుర్తుచేసుకున్నాడు. ఎంత క్లిష్టమైన సమస్యకైనా పరిష్కార మార్గాలుంటాయని వాటిని సరైన విధంగా ఎన్నుకోవడంలోనే విజయం దాగుందని త్రూలో చెప్పాడు. దౌత్యపరంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను సమసిపోయేలా చేయొచ్చని అతడు చెబుతున్నాడు. సులువైన పరిష్కార మార్గాలను వదిలి యుద్ధమంటూ ప్రజలను భయపెట్టొద్దని త్రూలో మరోసారి రెండు దేశాల అధ్యక్షులను కోరాడు.    'అణు యుద్ధం జరగకూడదు'