పెళ్లి చేసుకోవాలంటే.. అనుమతి తప్పనిసరి..

Header Banner

పెళ్లి చేసుకోవాలంటే.. అనుమతి తప్పనిసరి..

  Sun Dec 10, 2017 20:50        India, Telugu

మైనర్ అమ్మాయిలకు పెళ్లి జరిపించాలంటే తప్పకుండా ఆ అమ్మాయి అనుమతి పొందాలని దాంతోపాటు ఆమె తల్లి, సంబంధిత కోర్టు అనుమతి పొందిన తర్వాతే వరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అడ్ హక్ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ తేల్చిచెప్పింది. పెరిగిపోతోన్న బాల్య వివాహలను దృష్టిలో ఉంచుకుని సౌదీ ప్రభుత్వం ఆ కమిటీని నియమించింది. 18 ఏళ్ల వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారికి మాత్రమే మైనర్ హోదా వర్తిస్తుందని కమిటీ చెబుతోంది. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే తాము సూచించిన అనుమతి పత్రాలు ప్రభుత్వానికి సమర్పించాలని తర్వాతే పెళ్లి చేసుకోవాలని కమిటీ స్పష్టం చేస్తోంది. అలాగే పెళ్లికి ముందే మైనర్ అమ్మాయికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆ పత్రాలను కూడా కోర్టుకు సమర్పించాలని కమిటీ సూచిస్తోంది.    పెళ్లి చేసుకోవాలంటే.. అనుమతి తప్పనిసరి..