ఓ మహిళా టీచర్ చేసిన పని ఇది..

Header Banner

ఓ మహిళా టీచర్ చేసిన పని ఇది..

  Sun Dec 10, 2017 20:46        India, Telugu

ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోన్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులకు ఆమె మత్తు పదార్థాలు అమ్ముతోందని తమకు సమాచారం అందిందని వారు చెబుతున్నారు. స్కూల్‌కు వెళ్లి విచారణ జరుపగా అది నిజమేనని తెలిసిందన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రివేరా మాగ్నా(35) అనే మహిళ టీచర్ విద్యార్థులకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తోందని పోలీసులు చెప్పారు. ఎవ్వరికీ అర్థం కాకుండా ఉండేందుకు ఆమె కోడ్ భాషను కూడా ఉపయోగిస్తోందని వారు చెప్పారు. ఎన్నో రోజులుగా ఆమె ఆ పనిచేస్తోన్న ఎవ్వరూ గుర్తించలేకపోయారని పోలీసులు చెప్పారు. అయితే ఓ విద్యార్థి స్కూల్‌లో మత్తు పదార్థాలు రుచిచూశాడని దాంతో విద్యార్థి ప్రవర్తన వింతగా మారిందని వెంటనే టీచర్లు ఆ విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. వాటిని అతడికి అమ్మింది రివేరా అని తెలియడంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచామని వారు చెప్పారు.     ఓ మహిళా టీచర్ చేసిన పని ఇది..