దుర్గగుడి ఈవోపై పాలకమండలి సభ్యుల తిరుగుబాటు

Header Banner

దుర్గగుడి ఈవోపై పాలకమండలి సభ్యుల తిరుగుబాటు

  Sun Dec 10, 2017 20:23        India, Telugu

విజయవాడ దుర్గగుడి ఈవో సూర్యకుమారి, దేవస్థాన పాలకమండలి కమిటీ సభ్యుల మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఈవో తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పాలకమండలి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాల్లో మంత్రులు ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని పాలకమండలి సభ్యులు తీసుకెళ్లారు. అయినా ఈవో తీరు మార్చుకోకపోవడంతో కమిటీ అత్యవసరంగా సమావేశమయ్యారు. మొత్తం 16 మంది ఉన్న కమిటీలో 11 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సూర్యకుమారిపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇటీవల దేవస్థానం నుంచి కొన్ని బంగారు ఆభరణాలను తరలించి... కరిగించారని ఆ సమాచారం తమకు ఇవ్వడం లేదని కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే బియ్యం, పప్పులు, మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని పాలకమండలి సభ్యులు ఆరోపిస్తున్నారు.   దుర్గగుడి ఈవోపై పాలకమండలి సభ్యుల తిరుగుబాటు