మొబైల్ యూజర్లకు వచ్చే ఏడాది పండుగే!

Header Banner

మొబైల్ యూజర్లకు వచ్చే ఏడాది పండుగే!

  Fri Dec 08, 2017 21:14        India, Technology, Telugu

వచ్చే ఏడాది వస్తూ వస్తూ మొబైల్ వినియోగదారులకు తీపి కబురు మోసుకొస్తోంది. వచ్చే ఏడాది ఎంట్రీ లెవల్ 4జీ ఫోన్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. జియో 4జీ ఫోన్‌ భారత మొబైల్ మార్కెట్‌ను మలుపు తిప్పగా చాలా దేశీయ కంపెనీలు ఇప్పుడు అదే బాటన పయనిస్తున్నాయి. ఎయిర్‌టెల్ నుంచి బీఎస్‌ఎన్ఎల్ వరకు చవక ధరల్లో 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది ఈ ఫోన్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మొబైల్ ధరలు తగ్గనుండడానికి కారణం గూగుల్ సరికొత్త ఆండ్రాయిడ్ ఫీచర్ ‘ఓరియో గో’నే కారణమని అంటున్నారు. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ 4జీ ఫోన్ ధర రూ.3 వేల నుంచి రూ.3500 మధ్య ఉంది. దేశీయ మొబైల్ మేకర్స్ మైక్రోమ్యాక్స్, కార్బన్, ఇంటెక్స్, లావా ఈ ఫోన్లను ఎక్కువగా తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం రూ.3500గా ఉన్నఈ ఫోన్ల ధరలు వచ్చే ఏడాది రూ.2500కు దిగి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘ఆండ్రాయిడ్ గో’ ఫోన్లను తయారు చేసేందుకు ఆయా సంస్థలు ముందుకు రావడమే కారణమని అంటున్నారు.

 

ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ ఓరియోలోని ప్రత్యేక ఎడిషనే ఆండ్రాయిడ్ ఓరియో గో. ఇది ఎంట్రీ లెవల్ ఫోన్లకు సమర్థంగా పనిచేస్తుంది. అంతేకాక తయారీ ధర కూడా బాగా తక్కువ. ఈ వెర్షన్‌తో మైక్రోమ్యాక్స్, లావా కంపెనీలు జనవరి నుంచే ఫోన్లు తయారు చేయనుండగా, కార్బన్ నుంచి వచ్చే ఏడాది ద్వితీయ త్రైమాసికంలో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో ఈ ఫోన్ల ధరలు రూ.1500 కంటే కూడా దిగువకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు

 


   మొబైల్ యూజర్లకు వచ్చే ఏడాది పండుగే!