వచ్చే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడనున్న ధోనీ

Header Banner

వచ్చే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడనున్న ధోనీ

  Wed Dec 06, 2017 22:10        India, Sports, Telugu

వచ్చే ఐపీఎల్ మ్యాచ్ లలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడ‌నున్నారు. ఐపీఎల్‌లో మరోసారి ఎల్లో జెర్సీలో ధోనీ కనిపించనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టుపై రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో జరిగే ఐపీఎల్ 11వ సీజన్‌‌లో ధోని తిరిగి అదే జట్టులో కొనసాగనున్నారు. బుధవారం జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో రెండేళ్ల నిషేధానికి గురైన సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు వచ్చే సీజన్‌లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అంతేకాక 2015 సీజన్‌లో తమ జట్ల తరఫున ఆడిన ఐదుగురు ఆటగాళ్లు వచ్చే సీజన్‌లో తిరిగి అదే జట్లలో కొనసాగే వెసులుబాటు కల్పించారు. ఆ ఐదుగురిలో ముగ్గురు భారతీయులు, ఇద్దరు విదేశీయులను ఎంచుకోవాలని జట్టు సభ్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో ధోని వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడనున్నారు. అయితే వీళ్లు మాత్రమే కాక.. ఈ రెండేళ్లుగా రైజింగ్ పుణె సూపర్ జయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లలో ఆడుతున్న ఆటగాళ్లు కూడా తిరిగి తమ పాత జట్లలో ఆడే అవకాశముంది.   వచ్చే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడనున్న ధోనీ