సౌదీ, ఎమిరేట్స్‌ వేరు కుంపటి..ముగిసిన గల్ఫ్‌ సహకార మండలి భేటీ

Header Banner

సౌదీ, ఎమిరేట్స్‌ వేరు కుంపటి..ముగిసిన గల్ఫ్‌ సహకార మండలి భేటీ

  Wed Dec 06, 2017 21:58        India, Telugu

 గల్ఫ్‌ సహకార మండలి (జిసిసి) నుండి తాము వేరుపడుతున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా ప్రకటించాయి. సౌదీ అరేబియాతో కలిసి తాము ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ప్రకటించింది. కొద్ది నెలల క్రితం కతార్‌తో ఏర్పడిన వివాదంపై చర్చించేందుకు ఏర్పాటయిన జిసిసి భేటీ ప్రారంభం కావటానికి కొద్ది ముందు ఎమిరేట్స్‌ ఈ ప్రకటన వెలువరించింది. జిసిసి నుండి వేరుపడి మరో 'సంయుక్త సహకార మండలి'ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఎమిరేట్స్‌ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ ఆమోదించినట్లు ఎమిరేట్స్‌ విదేశాంగ శాఖ తన ప్రకటనలో వివరించింది. అయితే ఎమిరేట్స్‌ ప్రతిపాదనపై సౌదీ అరేబియా వెంటనే స్పందించలేదు. కొత్త మండలిలో ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా మధ్య సైనిక, రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే అంశంపై మిత్రదేశాలతో సమన్వయపరచి సహకారాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమిరేట్స్‌ విదేశాంగశాఖ వివరించింది. అయితే ఈ కొత్త కూటమిలోకి ఇతర గల్ఫ్‌ దేశాలను ఆహ్వాంచేదీ, లేనిదీ ఎమిరేట్స్‌ తన ప్రకటనలో ప్రస్తావించలేదు. 
సహకారం..సమన్వయం..ఐక్యతకతార్‌కు, ఇతర గల్ఫ్‌ దేశాలతో తలెత్తిన వివాదంపై చర్చించి పరిష్కారాన్ని కనుగొనటం లక్ష్యంగా ఏర్పాటయిన గల్ఫ్‌ సహకార మండలి 38వ వార్షిక సమావేశం దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసింది. గల్ప్‌ దేశాల మధ్య అన్ని రంగాలలో సహకారం, సమన్వయం కొనసాగిస్తూ ఐక్యతను సాధించేందుకు ఈ సదస్సు తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. సదస్సు ముగింపులో ప్రసంగించిన కువైట్‌ అమీర్‌ షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ జబార్‌ అల్‌ సబా మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై జిసిసి నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. జిసిసిని గల్ఫ్‌ దేశాల సంఘంగా మార్చాలన్న సౌదీ రాజు అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ ప్రతిపాదనను సభ్య దేశాల నేతలు సమర్థించారని ఆయన చెప్పారు. యెమెన్‌ మాజీ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే హత్యపై జిసిసి తీవ్ర విచారం వ్యక్తం చేసిందన్నారు. 
అమెరికా నిర్ణయానికి ఖండన  నాటి సరిహద్దులతో జెరూసలేం రాజధానికి ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటు ప్రతిపాదనను జిసిసి గట్టిగా సమర్థించిందని ఆయన చెప్పారు. జెరూసలేమ్‌ను ఇజ్రాయిల్‌ రాజధానిగా గుర్తించాలన్న అమెరికా నిర్ణయాన్ని జిసిసి తీవ్రంగా ఖండించింది. ఇరాక్‌లో ఐఎస్‌ విముక్తి ప్రాంతాల పునర్నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని సేకరించేందుకు 2018లో అంతర్జాతీయ దాతల సదస్సును నిర్వహించాలన్న కువైత్‌ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు జిసిసి ప్రకటించింది.    సౌదీ, ఎమిరేట్స్‌ వేరు కుంపటి..ముగిసిన గల్ఫ్‌ సహకార మండలి భేటీ