15నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

Header Banner

15నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

  Wed Dec 06, 2017 21:48        అమరావతి కబుర్లు, India, Telugu

దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యుత్తమమైన షీర్ వాల్ టెక్నాలజీతో పేదల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, 15నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని ఏపీ పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో పేదల ఇళ్ల నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదల ఇళ్ల పేరుతో గత ప్రభుత్వాలు రూ.4,500 కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డాయన్నారు. ఏ ప్రభుత్వం నిర్మించి ఇవ్వని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పేదల ఇళ్లను నిర్మించి ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొజ్జల, స్థానిక నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.   15నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ