'మహానటి' సర్‌ప్రైజ్ చేసేసింది

Header Banner

'మహానటి' సర్‌ప్రైజ్ చేసేసింది

  Wed Dec 06, 2017 21:29        Cinemas, India, Telugu

హానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. కీర్తిసురేష్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ రోజు సావిత్రి జయంతి సందర్బంగా 'మహానటి' టైటిల్ లోగోను విడుదల చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసేసింది చిత్రయూనిట్. టైటిల్ లోగోతో కూడిన ఓ ప్రత్యేక వీడియోను బయటకు వదిలింది యూనిట్. మాయాబజార్ సినిమాలోని ఓ బొమ్మల పెట్టెతో ప్రారంభమైన ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో 'అది ప్రియదర్శిని వదినా.. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వాళ్లకు కనిపిస్తుంది అంటూ మొదలై మీకు పెళ్లయిందా..? అయితే నన్ను చేసుకుంటారా..?, నన్ను వదిలి నీవు పోలేవులే.. అది నిజములే' అంటూ సావిత్రి సినిమాల్లోని డైలాగులు, పాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో అదరగొడుతున్న మ్యూజిక్ ప్లే అవుతుండగా ఓ మహిళ ఆ పెట్టెను తెరవగానే అందులోంచి 'మహానటి' టైటిల్ బయటకు రావడం తెగ ఆకట్టుకుంటోంది. వీడియో చివరలో మార్చి 29న సినిమాను విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది యూనిట్.   'మహానటి' సర్‌ప్రైజ్ చేసేసింది