విజయ్ దేవరకొండపైనే నందినిరెడ్డి ఆశలు..!

Header Banner

విజయ్ దేవరకొండపైనే నందినిరెడ్డి ఆశలు..!

  Wed Dec 06, 2017 21:22        Cinemas, India, Telugu

రోసారి తన సత్తా చాటేందుకు కష్టపడుతున్న ఆ లేడీ డైరెక్టర్‌కు కాలం కలిసి రావడం లేదట. దాంతో మంచి ఊపు మీదున్న యంగ్ హీరో మీదే లేడీ డైరెక్టర్ ఆశలు పెట్టుకుందనే ప్రచారం జరుగుతోంది.

 

ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్ల సంఖ్య చాలా తక్కువ. అందులో కమర్షియల్ హిట్స్ కొట్టిన వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తెలుగులో నవరతం లేడీ డైరెక్టర్లలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్న నందినిరెడ్డి ఆ తరువాత మాత్రం విజయాలు సాధించలేకపోయింది. 'అలా మొదలైంది' సినిమాతో దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నందినిరెడ్డి తనలో టాలెంట్ ఉందని నిరూపించింది. అయితే ఆ తరువాత ఆమె తెరకెక్కించిన 'జబర్దస్త్' పరాజయం పాలు కాగా, 'కళ్యాణ వైభోగమే' ఫర్వాలేదనిపించింది. దాంతో సీన్ మారిపోయింది.

మొదట్లో నందినీ రెడ్డితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించిన నిర్మాతలు, కథానాయకులు ఇప్పుడు ఆమెను అంతగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే అప్‌కమింగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఆమె దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆమె చెప్పిన స్టోరీ మాత్రం ఈ కుర్రహీరోకు నచ్చలేదట. అయినా ఆమెతో సినిమా చేసే విషయంలో విజయ్ దేవరకొండ కమిట్‌మెంట్‌తో ఉన్నాడని తెలుస్తోంది. ఇందుకు కారణం అశ్వినీదత్ కుమార్తె స్వప్నాదత్ అని కొందరు చర్చించుకుంటున్నారు.

 

స్వప్నాదత్ నిర్మించిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆమెపై ఉన్న గౌరవం కొద్దీ నందినిరెడ్డి సినిమాలో నటించేందుకు అంగీకరించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నందినిరెడ్డి తన కథతో 'అర్జున్ రెడ్డి' స్టార్‌ను మెప్పించలేకపోతే ఆమెకు దక్కిన ఛాన్స్ కూడా మిస్సయినట్టే అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి 'అర్జున్ రెడ్డి' స్టార్‌తో మళ్లీ ‘అలా మొదలైంది’ రేంజ్ హిట్‌ను నందినిరెడ్డి అందుకుంటుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

 


   విజయ్ దేవరకొండపైనే నందినిరెడ్డి ఆశలు..!