హర్యానాలో రైలు ప్రమాదం

Header Banner

హర్యానాలో రైలు ప్రమాదం

  Mon Dec 04, 2017 21:38        India, Telugu

-ట్రక్కుని ఢీకొట్టిన‌ ఇంజిన్‌

ఢిల్లీ నుంచి బయలుదేరిన బికనీర్‌ ఎక్స్‌ప్రెస్‌ సోమవారం ప్రమాదానికి గురైంది. హర్యానాలోని ఓ రైల్వే గేటు మధ్యలో చిక్కుకున్న ట్రక్కును రైలును ఢీకొన‌డంతో ఈ ప్రమాదం జరిగిందని, వేగంగా వస్తున్న రైలు ఢీకొట్ట‌డంతో ఇంజిన్‌ వేరైందని అధికారులు చెప్పారు. అనంతరం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని, దీంతో ఆ పక్కనే వున్న ట్రక్కుకు కూడా నిప్పు అంటుకుందని పేర్కొన్నారు. ఈ ఘటనకు ట్రక్కు డ్రైవర్‌ తప్పిదమే కారణమని ఆర్‌పిఎఫ్‌ పోలీసులు తెలిపారు. ఇంజిన్‌ బాగుచేసే పరిస్థితి లేకపోవడంతో వేరే ఇంజిన్‌ను రప్పించి రైలు ప్రయాణాన్ని ప్రారంభించినట్లు వివరించారు.    హర్యానాలో రైలు ప్రమాదం