రెెండు వారాల్లో తగ్గనున్న ఉల్లి, టమోటా ధరలు

Header Banner

రెెండు వారాల్లో తగ్గనున్న ఉల్లి, టమోటా ధరలు

  Mon Dec 04, 2017 21:32        India, Telugu

వచ్చే 15-20 రోజుల్లో ఉల్లి, టమోటా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం తెలిపింది. కొత్త పంట రావడంతో రిటైల్‌ మార్కెట్లో మరో రెండు వారాల్లో ధరలు తగ్గే అవకాశం వుందని కేంద్ర వ్యవసాయ కార్యదర్శి ఎస్‌.కె.పట్నాయక్‌ తెలిపారు. వీటి ధరలు పెరగడం తాత్కాలిక సమస్యేనని, త్వరలోనే పరిస్థితి కచ్చితంగా మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో రిటైల్‌ మార్కెట్లో ఉల్లి, టమోటా ధరలు కిలో రు.70 నుండి 80 మధ్య వున్నాయి. ఇతర ప్రధాన నగరాల్లో కూడా కాస్త అటూ ఇటూగా ఇదే ధరలు వుంటున్నాయి. మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి బాగుందని, ఆ పంట మార్కెట్‌కు వచ్చేస్తే పరిస్థితి మెరుగుపడుతుందని, ధరలు దిగి వస్తాయని పట్నాయక్‌ తెలిపారు. టమోటా పంట కూడా వేశారని, త్వరలోనే అది కూడా దిగుబడి వచ్చేస్తుందని, మార్కెట్‌కు ఉత్పత్తులు ఎక్కువ వస్తే ధరలు వాటంతటవే పడిపోతాయని చెప్పారు. అకాల వర్షాలతో, కొన్ని చోట్ల వర్షాభావంతో ఉల్లి, టమోటా దిగుబడి దెబ్బతింది.    రెెండు వారాల్లో తగ్గనున్న ఉల్లి, టమోటా ధరలు