కాంగ్రెస్‌ది ఔరంగజేబు పాలన

Header Banner

కాంగ్రెస్‌ది ఔరంగజేబు పాలన

  Mon Dec 04, 2017 21:29        India, Telugu

- బెయిల్‌పై విడుదలైన వారికి పార్టీ పగ్గాలా?

- అధ్యక్షునిగా రాహుల్‌ ఎన్నికపై మోడీ విమర్శ

       గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షునిగా రాహుల్‌ పేరు ఖరారైన నేపథ్యంలో ఆ పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. వల్సాద్‌ జిల్లాలోని ధర్మపూర్‌ ర్యాలీలో మోడీ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేషనల్‌ హెరాల్డ్‌ కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ బెయిల్‌పై విడుదలైన వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా నియమించడం కాంగ్రెస్‌ దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. ఔరంగజేబు పాలన పొందిన పార్టీకి అభినందనలు తెలుపుతున్నానన్నారు. 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలే తమకు శిరోధార్యమని ప్రధాని చెప్పుకొచ్చారు.     

  ఒకానొక సందర్భంలో కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ మాట్లాడుతూ ''మొఘల్‌ కాలంలో ఎన్నికలు జరిగేవా? జహంగీర్‌ తరువాత షాజహాన్‌, ఆయన తరువాత ఔరంగజేబ్‌ రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు కదా!'' అని అన్నారని తెలుపుతూ దీన్ని బట్టి తమది కుటుంబ పార్టీ అని కాంగ్రెస్‌ ఒప్పుకుంటోందా? అని మోడీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు రాహుల్‌ గాంధీ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తప్ప ఇంకెవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఆయన ఎన్నిక ఖరారైనట్లే. 


   కాంగ్రెస్‌ది ఔరంగజేబు పాలన