మేరీ పాస్ మా హై....మరపురాని డైలాగ్

Header Banner

మేరీ పాస్ మా హై....మరపురాని డైలాగ్

  Mon Dec 04, 2017 21:18        Cinemas, India, Telugu

శికపూర్ జ్ఞాపకాల దొంతరలో....ఓ మరపురాని చిత్రం 'దీవార్'. అమితాబ్ బచ్చన్, శశికపూర్ అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం 1975లో విడుదలై అఖండ విజయం సాధించింది. యష్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ ఏడాది ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మూవీ అవార్డుతో పాటు మరో 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఎగరేసుకుపోయింది. 'ఇండియాటైమ్స్' టాప్-25 సినిమాల్లో ఈ చిత్రం చోటు చేసుకుంది. ఇందులో అమితాబ్‌కు ధీటుగా శశికపూర్ నటన ప్రశంసలు అందుకుంది. పరిస్థితుల ప్రభావంతో గ్యాంగ్‌స్టర్‌గా మారిన అమితాబ్‌ను పట్టుకునే పోలీస్ అధికారి పాత్రలో శశికపూర్ నటించారు. ఇందులో ఓ సందర్భంలో 'నా దగ్గర బిల్డింగ్‌లు ఉన్నాయి. ప్రాపర్టీలు ఉన్నాయి. కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. వాహనాలున్నాయి. నీ దగ్గర ఏముంది?' అని తన తమ్ముడైన పోలీస్ ఆఫీసర్ శశికపూర్‌ను అమితాబ్ ప్రశ్నిస్తాడు. శశికపూర్ చాలా కూల్‌గా...అంతే గంభీరంగా... 'మేరీ పాస్ మా హై' (నా దగ్గర అమ్మ ఉంది) అంటాడు. ఆ డైలాగ్‌తో అప్పట్లో థియేటర్లు చప్పట్లతో మార్మోగిపోయాయి. ఈ సన్నివేశం ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలకు ఆదర్శంగా నిలిచింది. ఆ సినిమా అమితాబ్‌కు 'యాంగ్రీ యంగ్ మాన్' ఇమేజ్ తెప్పిస్తే, శశికపూర్‌కు మరెన్నో పవర్‌ఫుల్స్ రోల్స్ దక్కాయి. ఇదే చిత్రాన్ని తెలుగులో ఎన్టీఆర్, రామకృష్ణ కాంబినేషనల్‌లో 'మగాడు'గా 1976లో రీమేక్ చేశారు. తెలుగులోనూ సినిమా పెద్ద హిట్ అయింది.   మేరీ పాస్ మా హై....మరపురాని డైలాగ్