శాడిస్టు భర్త గురించి బయటపడిన అసలు విషయం ఇదే

Header Banner

శాడిస్టు భర్త గురించి బయటపడిన అసలు విషయం ఇదే

  Sun Dec 03, 2017 22:00        Telugu, India

శాడిస్టు భర్తపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తొలి రాత్రే నవ వధువుపై దాడి చేసి కాళరాత్రి మిగిల్చిన శాడిస్టుపై కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ప్రస్తుతం కోలుకుంటోంది. మధ్య తరగతికి చెందిన యువతి ఆమె. వైవాహిక జీవితంపై భర్తతో గడుపబోయే మధుర క్షణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకుంది. అయితే ఆమె స్వప్నం చెరిగిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. తాను కన్న కలలు పండాల్సిన మొదటి రాత్రే ఆమెకు కాళరాత్రిగా మారింది. జీవితంలో వెలుగు నింపుతాడని అనుకున్న మొగుడే కాలయముడిగా మారాడు. మొదటి రాత్రే వికృత రూపం చూపాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్ది చిత్రవధ చేశాడు. ఆమె అందమైన స్వప్నాన్ని కాస్త భయంకర పీడకలగా మార్చాడు.

 

 

శాడిస్టు భర్త గురించి బయటపడిన అసలు విషయం ఇదే 
03-12-2017 20:09:31

చిత్తూరు: శాడిస్టు భర్తపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తొలి రాత్రే నవ వధువుపై దాడి చేసి కాళరాత్రి మిగిల్చిన శాడిస్టుపై కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ప్రస్తుతం కోలుకుంటోంది. మధ్య తరగతికి చెందిన యువతి ఆమె. వైవాహిక జీవితంపై భర్తతో గడుపబోయే మధుర క్షణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకుంది. అయితే ఆమె స్వప్నం చెరిగిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. తాను కన్న కలలు పండాల్సిన మొదటి రాత్రే ఆమెకు కాళరాత్రిగా మారింది. జీవితంలో వెలుగు నింపుతాడని అనుకున్న మొగుడే కాలయముడిగా మారాడు. మొదటి రాత్రే వికృత రూపం చూపాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్ది చిత్రవధ చేశాడు. ఆమె అందమైన స్వప్నాన్ని కాస్త భయంకర పీడకలగా మార్చాడు.

 

జిల్లాలోని గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌కు చిన్న దామరగుంట గ్రామానికి చెందిన మునికృష్ణారెడ్డి కుమారై శైలజకు మూడు రోజుల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వధూవరులిద్ధరు వధువు ఇంటికి వచ్చారు. సంప్రదాయం ప్రకారం పెద్దలు ముహూర్తం చూసి శోభనం ఏర్పాటు చేశారు. అయితే వరుడు రాజేష్ శోభనం రోజు శైలజపై దాడికి తెగబడ్డాడు. శైలజ తీవ్రగాయాలతో ఓ పక్కన పడి ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. బాధిత యువతి శైలజ ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

 

శోభనం గదిలో ఏం జరిగింటే..

శోభనం గదిలో రాజేష్ కిరాతకం బయటపడడానికి ముందు చాలా స్క్రీన్ ప్లేనే నడిచింది. తొలిరాత్రి కొద్ది నిమిషాల్లోనే వదువు శైలజ శాడిస్టు మొగుడి వ్యవహారాన్ని కనిపెట్టింది. అతని ప్రవర్తను బట్టి సంసారానికి పనికిరాడని నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ పెద్దలకు తెలిపింది. వారు రాజేష్ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో రాజేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు వధువు తండ్రి ప్రయత్నించాడు. తర్వాత లోపలకి వెళ్లిన రాజేష్ అంత వరకు దాచుకున్న తన వికృత రూపాన్ని ప్రదర్శించాడు. తాను సంసారానికి పనికిరానని భార్య శైలజ ముందు ఒప్పుకుంటూనే మరో వికృతమైన ప్రతిపాదన చేశాడు. తన సంసారానికి పనికిరాని వాళ్లు ఎంతో మంది పెళ్లిల్లు చేసుకుంటున్నారని శైలజతో చెప్పిన రాజేష్... పెళ్లితో తనతో అయినా కాపురం ఎవరితోనైనా చేసుకోమంటూ ఆఫర్ ఇచ్చాడు. తనకు విషయం లేదనే సంగతిని ఎవరితో చెప్పొదంటూ ప్రాధేయపడ్డాడు. గుట్టుగా జీవితాన్ని లాగించాలంటూ ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఒప్పుకోకపోవడంతో రాజేష్ సైకోగా మారాడు.

 

ఇదిలావుండగా ఈ నెల 1వ తేది శుక్రవారం తెల్లవారుజామున శైలజాకు రాజేష్‌కు పెళ్లి జరిగింది. అదే రోజు రాత్రి వధువు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు. శైలజను ముస్తాబు చేసి గదిలోకి పంపారు. మిగతా కుటుంబసభ్యులంతా నిద్రలోకి జారుకున్నారు. అయితే సగం రాత్రి వేళ హర్రర్ మూవీలో వినిపించినట్టు శోభనం గదిలో నుంచి యువతి కేకలు వినిపించాయి. ఏం జరిగిందన్న ఆందోళనతో యువతి తల్లిదండ్రులు తలుపుతట్టారు. ఎంతకీ తలుపు తీయకపోగా గదిలో నుంచి ఏడుపులు వినిపించడంతో వదువు కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. తలుపులు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ లోగ నెత్తుటి గాయాలతో శైలజ తలుపు తీసుకుని బయటకొచ్చింది. ముఖమంతా గాయాలతో కళ్లు వాచిపోయి దారుణంగా ఉన్న ఆమెను చూసి తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురైన విషయం తెలిసిందే.


   శాడిస్టు భర్త గురించి బయటపడిన అసలు విషయం ఇదే