వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్‌

Header Banner

వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్‌

  Tue Nov 28, 2017 22:35        India, Technology, Telugu

తమ కస్టమర్ల కోసం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మెసేజుల్లో భాగంగా పంపే యూట్యూబ్ వీడియోలను ఇక నుంచి అక్కడే ప్లే చేసుకోవచ్చు. ఇది ఐవోఎస్ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే చాట్‌లో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియో లింకును పంపిస్తే.. ఆ వీడియోను చూస్తూ చాట్ చేసుకోవచ్చు. అంతేకాదు వేరే మేటర్ కూడా చాట్‌ చేసుకోవచ్చు. కాగా గతంలో ఎవరైనా యూట్యూబ్ వీడియో లింక్ పంపితే.. యూట్యూబ్ యాప్‌లోకి వెళ్లితేనే ప్లే అయ్యేది. ఇప్పుడు అలా ఇబ్బంది పడకుండా నేరుగా సంభాషణల మధ్యలోనే వీడియోను చూసే సదుపాయం కల్పించింది వాట్సాప్.   వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్‌