పోలీసుల గుప్పెట్లోకి హైదరాబాద్

Header Banner

పోలీసుల గుప్పెట్లోకి హైదరాబాద్

  Tue Nov 21, 2017 22:50        India, Telugu

నగరం పోలీసు గుప్పిట్లోకి వెళ్లింది. ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ, మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇంకో వైపు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక రాక, ఇవే కాదు వరుస వివాహాలు, అంతర్జాతీయ సదస్సు, మెట్రో రైల్ ప్రారంభోత్సవంతో హైదరాబాద్ పోలీసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్టాండ్ టూ డ్యూటీలో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కనీసం ఈ పది రోజులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో హైదరాబాదీలు గిలగిలలాడే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ఇబ్బందులు మరీ ఎక్కువ కాకుండా రాకపోకల మళ్లింపు ద్వారా పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

మూడు రోజుల పాటు ఉపరాష్ట్రపత్తి వెంకయ్య నాయడు వివిధ కార్యక్రమాల్లో పాల్గోనేందుకు నగరానికి వచ్చారు. ఉపరాష్ట్ర పతి పర్యటన సందర్బంగా ఆయన వెళ్లే అన్ని రూట్లలో ట్రాఫిక్ నియత్రించాల్సి ఉంటుంది. ఇప్పటికే నగరంలోని దాదాపు ఎనబై శాతం రహదారులు శిథిలమై పోవడంతో పీక్ ఆవర్స్‌లో ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా ప్రముఖుల పర్యటనలు అనగానే ట్రాఫిక్ మళ్లింపు చేస్తూ వాళ్లకి రూట్ క్లియరెన్స్ చేస్తున్నారు. దీంతో సగటు వాహనదారుడి కష్టాలు పెరిగిపోయాయి. ఈ వ్యవహారంలో ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం..వీడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది.

 

మూడు రోజుల ఉపరాష్ట్రపతి పర్యటన ఒక ఎత్తైతే, మరో రెండు మూడు రోజులు నగరంలో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. నగరం నడిబొడ్డు నుండి శివారు ప్రాంతాల వరకు వెలసిన ప్రాధాన దారుల్లో అన్ని ఫంక్షన్ హాల్‌లలో ఈ వివాహాలు జరగనున్నాయి. దీంతో పెళ్లిలకు వచ్చే వారితో పెద్ద ఎత్తున వాహనాలు నగరానికి చేరనున్నాయి. దీని వల్ల కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పాటు పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయో అవకాశం ఉంది. అసలే వీవీఐపీ మూవ్‌మెంట్. అందున వాహనాల రద్దీ ఇది కూడా ట్రాఫిక్ పోలీసులకు పరీక్షగా మారింది.

 

ఇదంతా ఒక ఎత్తైతే ఈ నెల 27,28,29 మూడు రోజుల పాటు జరిగే ప్రపంచస్థాయి పారిశ్రామిక వేత్తల సదస్సు భద్రతా పరంగా పోలీసులకు సవాలుగా మారింది. సదస్సుకు ప్రధాని మోదీతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు, అమెరికా అద్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రాంప్ వస్తుండటంతో సైబరాబాద్ మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లింది. సైబరాబాద్‌లోని పెద్ద ఎత్తున ఐటీ , ఇతర మల్లీనేషనల్ కంపెనీలు ఉండడంతో లక్షల సంఖ్యలో ఉద్యోగస్తులు విధులకు హాజరవుతుంటారు. కొంతమంది సొంత వాహనాల్లో వస్తే మరి కొందరికి కంపెనీ ప్రొవైడ్ చేసిన వాహనాల్లో వస్తారు.

 

సైబరాబాద్‌లోనే అత్యంత హై సెక్యూరిటీ ఉండటంతో సదస్సు నిర్వహణ సమయంలో ట్రాఫిక్ మళ్లీంపు ఎలా అనే దానిపై పోలీసులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. సదస్సు జరిగే మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పలు కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిపాదనలు పంపినట్లుగా తెలుస్తోంది.

 

అయితే మరి సాధారణ వాహనదారుల పరిస్థితి ఏంటీ..? ఆ వాహనాలను ఏ విధంగా డైవర్ట్ చేయాలి. మెట్రో రైల్ నిర్మాణం వల్ల ఇప్పటికే నగరంలోని రోడ్లను కుంచించుకుపోవడంతో కూకట్‌పల్లి, జెన్టీయూ, హైటెక్ సిటి వంటి పలు ప్రాంతాల్లో నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లీస్తే సెంట్రల్ సిటీపై ప్రభావం పడే అవకాశం ఉంది. అదికారులు మాత్రం తమకు ఎన్నో ఇవెంట్స్‌కి బందోబస్తు చేసిన అనుభవం ఉంది. అందువల్ల ఈ సమస్యలను అధికమిస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు

 


   పోలీసుల గుప్పెట్లోకి హైదరాబాద్