‘పీఎస్వీ గరుడవేగ’ లాభాల పంట

Header Banner

‘పీఎస్వీ గరుడవేగ’ లాభాల పంట

  Tue Nov 21, 2017 22:42        Cinemas, India, Telugu

రాజశేఖర్ నటించిన చిత్రంకి పాజిటివ్ టాక్ వచ్చి చాలా కాలం అయింది. వరుస హిట్‌లతో ఒకప్పడు యాంగ్రీ యంగ్‌మెన్ అనిపించుకున్న రాజశేఖర్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రం ఆయనకి కొత్త ఊపిరినిచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది కానీ, ఆ టాక్‌కి అనుగుణంగా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. కానీ ఓవర్సీస్ హక్కులు తీసుకున్న వారికి మాత్రం ఈ చిత్రం 10 రెట్ల లాభాలను అందించిందని తాజాగా వార్తలు బయటికి వచ్చాయి. 2017 సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో లాభాలను అందించిన చిత్రాల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ‘పీఎస్వీ గరుడవేగ’ ఉందంట.

 

‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రం యుఎస్ బాక్సాఫీస్‌లో హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టింది. రూ.32 లక్షలతో ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు అమ్ముడైన విషయం తెలిసిందే. ఈ చిత్రం మూడున్నర కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిందంటే ఇక లాభాలు ఏ రేంజ్‌లో వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. యుఎస్‌లో రిలీజైన సినిమాలన్నింట్లోకి పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ ‘పీఎస్వీ గరుడవేగ’ లాభాల పంట పండించిందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నట్లుగా తాజాగా కథనాలు ప్రసారం అవుతున్నాయి.

 


   ‘పీఎస్వీ గరుడవేగ’ లాభాల పంట