టీఆర్ఎస్ నేతను నమ్మించి హత్య చేసిన దుండగులు

Header Banner

టీఆర్ఎస్ నేతను నమ్మించి హత్య చేసిన దుండగులు

  Tue Nov 21, 2017 22:41        India, Telugu

సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ నేత వల్లభనేని శ్రీనివాసరావు హత్య కేసులో మిస్టరీ వీడింది. శ్రీనివాసరావును నమ్మించి హత్య చేసిన ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ముందు దుండగులు శ్రీనివాసరావును బైక్‌పై తీసుకెళ్లారు.ఇప్పుడు ఈ దృశ్యాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎక్స్‌క్లూజివ్‌గా లభించాయి.

 

వల్లభనేని శ్రీనివాసరావు హత్యకు ముందు అతన్ని నమ్మించి తీసుకెళ్లిన విషయం ఇప్పటికే పోలీసు అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఏ విధంగా అతన్ని నమ్మించి తీసుకెళ్లారు, అతన్ని తీసుకెళ్లిన వ్యక్తులెవరు, అసలేం జరిగిందనేది పోలీసులు సీసీ పుటేజ్ పరిశీలించిన తర్వాతే అసలు విషయాలు బయటపడ్డాయి.

 

అసలు నిజాలు ఇవే: మొత్తం ముగ్గురు కలిసి శ్రీనివాసరావును ఓ బైక్‌పై కూర్చొపెట్టుకొని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. అంతకుముందు అసలేం జరిగిందన్నది ఇప్పుడు చర్చ నీయాంశమైంది. శ్రీనివాసరావు ఓ ఫంక్షన్ హాలు దగ్గర కొంతమంది మద్యం తాగుతున్న విషయాన్ని చూసి ఎస్ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఎస్సార్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మద్యం తాగుతున్న వారిని పోలీస్ జీపులో తీసుకెళ్లారు. జీపులో తీసుకెళ్లిన తర్వాత శ్రీనివాసరావు అక్కడున్న విషయాన్ని ఒకతను గుర్తించారు. అనంతరం వారు పోలీసులతో మాట్లాడారు. ఆ తర్వాత శ్రీనివాసరావును అక్కడి నుంచి సనత్ నగర్ బస్టాండ్ దగ్గరికి తీసుకువెళ్లారు. అక్కడే నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శ్రీనివాసరావుతో గొడవపడి అతన్ని హత్య చేశారు. ఈ మొత్తం కేసు ఛేదించడానికి సీసీ కెమెరా పుటేజ్ ఉపయోగపడింది.

 

అదే రోజు రాత్రి సుమారు 12 గంటల మధ్య అతని సెల్ ఫోన్ లాస్ట్ ఫోన్ కాల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి వెళ్లింది. ఆ తర్వాతే శ్రీనివాసరావును హత్య చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తి పేరు జాదవ్. నిందితులు ఐదుగురు ఈ కేసులో ఏ1గా ఉన్న అబ్దుల్‌కి సన్నితులు. ఆధిపత్య పోరులో భాగంగానే శ్రీనివాసరావును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

 


   టీఆర్ఎస్ నేతను నమ్మించి హత్య చేసిన దుండగులు