విద్యార్థి మార్క్‌షీటుపై సల్మాన్‌ ఫోటో

Header Banner

విద్యార్థి మార్క్‌షీటుపై సల్మాన్‌ ఫోటో

  Tue Nov 21, 2017 22:01        India, Telugu

ఆగ్రా యూనివర్సిటీకి చెందిన ఫస్ట్‌ ఇయర్‌ బీఏ విద్యార్థి మార్క్‌షీటుపై నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఫోటో ప్రింట్‌ అయి వచ్చింది. విద్యార్థులకు మెడల్స్‌, సర్టిఫికేట్లు జారీచేయడానికి అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్‌ డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ ఆగ్రా యూనివర్సిటీకి రాబోతున్న ఒక్క రోజు ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోల్‌ నెంబర్‌ 17028700***** తో ఉన్న మార్క్‌షీటుపై సల్మాన్‌ ఖాన్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో పేస్టు చేసి ఉంది. అంతేకాక అలీగఢ్‌లోని తేజ్‌పూర్‌ జావాలో ఉన్న ఆగ్రా యూనివర్సిటీ అనుబంధ కాలేజీ అమ్రత సింగ్‌ మెమోరియల్‌ డిగ్రీ కాలేజీ నుంచి 35 శాతం మార్కులతో ఆ విద్యార్థి తొలి ఏడాది పూర్తి చేసినట్టు ఉంది.    విద్యార్థి మార్క్‌షీటుపై సల్మాన్‌ ఫోటో