ఆస్తమా నుంచి ఉపశమనం కోసం..!

Header Banner

ఆస్తమా నుంచి ఉపశమనం కోసం..!

  Sun Nov 19, 2017 21:35        Health, India, Telugu

   కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ఒకటి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది. అంటే, ఆస్తామా వంటివి. వీటి లక్షణాలు ఊపిరి పీల్చుకోవడంలో సౌండ్‌ రావడం, బాగా దగ్గడం వల్ల వచ్చే కాఫ్‌. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అంతేకాదు, ఇలాంటివారు ఆహార నియమాల్లో చాలా పద్ధతులు పాటించాలి. ఆస్తమా ఉన్నవారు ఎలాంటి ఆహారపదార్థాలను తీసుకోవాలో చూద్దాం. 
- శరీరంలో విటమిన్‌ సి తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో శరీరం 
త్వరగా రోగాలబారిన పడుతుంది. ఆస్తామా ఉన్నవారు తమ ఆహారంలో విటమిన్‌ సి ఉండేలా చూసుకోవాలి. ఆరెంజ్‌, నిమ్మకాయ, ద్రాక్ష, కివి, బ్రొకొలి, టమాటా, షిమ్లా మిర్చి వంటివి ఉండేలా చూసుకోవాలి. 
- బీటా కెరోటిన్‌ ఆస్తమా వారికి చాలా ఉపయోగపడుతుంది. వీటితో పాటు అప్రికోట్లు, చెర్రీస్‌, క్యాపిక్సమ్‌, గ్రీన్‌ మిర్చి ఆహారంలో చేర్చాలి. 
- రాత్రి పడుకునే సమయంలో ఓ చెంచా తెనే, దాల్చినచెక్కల మిశ్రమాన్ని తీసుకోవాలి. ఉదయం లేచిన తర్వాతా ఇలాగే చేయాలి. కొన్నిరోజులు ఇలాచేయడం వల్ల కొంత ఉపశమనం పొందొచ్చు. 
- కొంతమందికి కెఫిన్‌ కలిసి ఉన్న పదార్థం హానికారకంగా ఉంటుంది. కానీ, ఆస్తమా వారికి కాఫీ తాగడం మంచిది. అయితే, రోజులో రెండుసార్లుకు మింంచి తాగరాదు. కప్పు వేడినీటిలో రెండుమూడు తులసి ఆకులు వేసి తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
వీటికి దూరంగా ఉండండి
- ఎక్కువగా వేయించిన పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తామావారు వేరుశనగలను తినడం తగ్గించాలి. ఎక్కువ ఉప్పును వాడడమూ మంచిదికాదు. జంక్‌ఫుడ్‌, వెన్న లాంటివి ఈ రోగాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.    ఆస్తమా నుంచి ఉపశమనం కోసం..!