టీడీపీ కోవర్టులకే నందులు: శివాజీ

Header Banner

టీడీపీ కోవర్టులకే నందులు: శివాజీ

  Fri Nov 17, 2017 21:39        Cinemas, India, Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నంది అవార్డుల విషయంలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అర్హులైన వారికి అవార్డులు ఇవ్వకుండా, వెనుక ఏదేదో చేశారని, కావాలని కొందరిని ప్రక్కన పెట్టారని ఇలా అవార్డులు రాని వారు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అవార్డులపై టీవీ చానెల్స్ చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తూ, అవార్డులపై ఎంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాయి. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), బన్నీ వాసు, బండ్ల గణేష్, గుణశేఖర్, మల్కాపురం శివకుమార్, తాజాగా రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఈ అవార్డుల విషయంలో తమ అసంతృప్తిని తెలియజేశారు. తాజాగా నటుడు శివాజీ ఈ అవార్డులపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇండస్ట్రీలో కొందరు భజనపరులు ఉన్నారు. వారు అధికారంలో ఉన్న ప్రభుత్వంకి భజన చేయడం, తద్వారా తమ పనులు చేసుకోవడం వంటివి సర్వసాధారణం అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులలో మెగా ఫ్యామిలీ హీరోలకి నిజంగానే అన్యాయం జరిగింది. కేవలం టీడీపీ కోవర్టులకే అవార్డులు అన్నట్లుగా ఈ అవార్డులను ఇచ్చారు. అవార్డులు కొందరు వ్యక్తుల అభిప్రాయాల నుండి కాకుండా ప్రజల అభిప్రాయాలతో ఇస్తే ఈ గొడవలు ఉండవు. గతంలో నాకు కూడా ఇలానే అన్యాయం జరిగింది. మిస్సమ్మ సినిమా బాగా ఆడింది. ఆ సినిమాలో నా నటనకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలని కమిటీ సభ్యులు కొందరు ప్రకటించినా, మరికొందరు అడ్డుకోవడంతో ఆ అవార్డు నాకు దక్కకుండా చేశారు. కనీసం ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించడానికి కూడా వీలు లేకుండా చేశారు. ఇలా కొందరి అభిప్రాయాలతో అందరికీ న్యాయం జరగదు. అలా జరగాలంటే ప్రేక్షకులని ఇందులో న్యాయనిర్ణేతలని చేస్తేనే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు..’’ అంటూ నటుడు శివాజీ ఈ అవార్డులపై తన గళం వినిపించారు.   టీడీపీ కోవర్టులకే నందులు: శివాజీ